జాతీయ అవార్డులను గెలుచుకున్న ‘జెర్సీ’, ‘మహర్షి’

  • IndiaGlitz, [Monday,March 22 2021]

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర వివరాలను వెల్లడించింది. జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు)గా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు మరో అవార్డు కూడా దక్కింది. ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్‌ నూలి అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ‘జల్లికట్టు’ (మలయాళం) చిత్రం దక్కించుకుంది.

జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా మహర్షి సినిమాకు గానూ రాజు సుందరం ఎంపికయ్యారు. ఉత్తమ ప్రొడక్షన్ హౌస్ విభాగంలో ‘మహర్షి’ సినిమా ఎంపికైంది. జాతీయ ఉత్తమ నటిగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎంపికయ్యారు. మణికర్ణిక సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇక జాతీయ ఉత్తమ నటుడు కేటగరీలో మనోజ్ బాజ్‌పాయ్, ధనుష్‌ను సంయుక్తంగా ప్రకటించారు. అసురన్ చిత్రానికి ధనుష్ ఎంపకవగా.. భోంస్లే చిత్రానికి మనోజ్ బాజ్‌పాయ్ ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా సూపర్ డిలాక్స్‌లో నటనకు గానూ విజయ సేతుపతి ఎంపికయ్యారు. ఉత్తమ హిందీ చిత్రంగా చిచోరే నిలిచాయి. జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా కస్తూరి ఎంపికైంది. ఇక ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ‘జల్లికట్టు’ (మలయాళం) చిత్రం దక్కించుకుంది.

జెర్సీ, మహర్షిలకు అవార్డుల పంట


ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ

ఉత్తమ ఎడిటర్ - జెర్సీ(నవీన్ నూలీ)

ఉత్తమ వినోదాత్మక చిత్రం- (మహర్షి)

ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం (మహర్షి)


67వ జాతీయ చలన చిత్ర అవార్డులు


ఉత్తమ నటుడు: ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌(భోంస్లే)

ఉత్తమ నటి: కంగనా రనౌత్‌(మణికర్ణిక/పంగా)

ఉత్తమ దర్శకుడు: బహత్తార్‌ హూరైన్‌

ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

ఉత్తమ చిత్రం(హిందీ): చిచ్చోరే

ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ

ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్‌

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం(మహర్షి)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)

ఉత్తమ సంగీత దర్శకుడు(పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)

ఉత్తమ సంగీత దర్శకుడు(నేపథ్య): జ్యేష్టపుత్రో

ఉత్తమ మేకప్‌: రంజిత్‌(హెలెన్‌)

ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్‌ (కేసరి-తేరీ మిట్టీ)

ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)

More News

ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!!!

వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో ఆది సాయి కుమార్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

'ఇక్షు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన అల్లరి నరేష్

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో  రాం అగ్నివేష్ కథానాయకుడిగా ఋషిక దర్శకత్వంలో

స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ విజేత యశస్వి కొండేపూడి .... రానా దగ్గుబాటి చేతుల మీదుగా ట్రోఫీ

ఆట ఎప్పుడు మొదలైనా గెలుపు ఎవరిది?? విజేత ఎవరు?? అని ఎదురుచూస్తుంటాం. 30 వారాల సుదీర్ఘ ప్రయాణం తరువాత యశస్వి కొండేపూడి, స రి గ మ ప

30 శాతం పీఆర్సీ ప్రకటన.. కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వోద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.

మ‌నోజ్ కోసం ముందుకొచ్చిన సాయితేజ్‌..?

మంచు మ‌నోజ్‌, సాయితేజ్ మంచి స్నేహితులు. సినిమాల్లోకి రాక ముందు ఇద్ద‌రూ క‌లిసి ఎంచ‌క్కా క్రికెట్ ఆడుకునేవాళ్లు.