ఆ హాలీవుడ్ చిత్రం ఆధారంగా 'జెర్సీ'
Send us your feedback to audioarticles@vaarta.com
విదేశాల్లో ఫుట్‌బాల్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసు కదా.. అంతే వయసున్న ఓ వ్యక్తి తన లోకల్ ఫుట్ బాల్ టీంలో సభ్యుడిగా ఉండాలనుకుంటాడు. అందుకోసం ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని ... లక్ష్యాన్ని చేరుకున్నాడా? అనేది తెలుసుకోవాలంటే ఇన్విసబుల్ సినిమా చూడాలి.
36 ఏళ్లు దాటిన ఓ వ్యక్తి క్రికెటర్ కావాలనుకుంటాడు. తను చేసే ఉద్యోగం, అన్నింటినీ వదులుకుని తన కలల వెంబడి పరుగుపెడతాడు. తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి? ఇదొక చిత్రం... విడుదలకు సిద్ధమవుతోంది. ముందు చెప్పిన సందర్భం ఓ హాలీవుడ్ సినిమాలోనిది.
ఇప్పుడు నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం కూడా దానికి దగ్గరగా ఉంది కదా. అందులో హీరో ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనుకుంటే.. మన హీరో క్రికెటర్ కావాలనుకుంటాడు. మరి సినిమా విడుదలైతే కానీ..తెలియదు మన జెర్సీ సినిమా సదరు హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా తెరకెక్కిందో లేదో అని. మళ్ళీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.