డిసెంబర్ 30న జీవా - కాజల్ 'ఎంతవరకు ఈ ప్రేమ'

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

'రంగం' సూపర్ హిట్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కావలై వేండాం' తెలుగులో 'ఎంత‌వ‌ర‌కు ఈ ప్రేమ‌' టైటిల్ తో డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ అందిస్తున్నారు. 'యామిరుక్క బ‌య‌మేన్‌' ఫేమ్ డీకే దర్శకత్వం వ‌హిస్తున్నారు. సెన్సార్ కంప్లీట్ చెసుకున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈనెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఈ సంద‌ర్భంగా డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ మాట్లాడుతూ “ రంగం చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోగా నటించిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాట‌ల‌కు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ముఖ్యంగా కాజ‌ల్ అగ‌ర్వాల్ పై చిత్రీక‌రించిన గ్లామ‌ర్ స‌న్నివేశాలు యూత్ ను వీప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి. ఇప్ప‌టికే ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాతో ఆ ఫాలోయింగ్ మ‌రింత రెట్టింపు అవుతుంది.

ఈ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకోవ‌డం కోసం ట‌ఫ్ పోటీ ఎదురైన‌ప్ప‌టికీ ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నాను. తమిళ్ తో పాటు తెలుగులో సైతం ఒకెసారి విడుదల చెయాలనుకున్నా, సమయానికి తెలుగు సెన్సార్ అవ్వక పోవటంతొ తెలుగు వెర్షన్ రిలీజ్ లేటయింది. ఈ రోజు సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. డిసెంబ‌ర్ 30న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చెస్తున్నాము. 'రంగం' చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా త‌మిళంలో నిర్మించటం విశేషమని అన్నారు.

ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్..

More News

అమితాబ్ రాక - వర్మ ర్యాలీ..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వంగవీటి.

మహేష్ 1 నేనొక్క డినే తర్వాత ఈ సినిమానే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు 23వ సినిమాను క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ తో చేస్తున్నారు.

సుకుమార్ మూవీలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న చ‌ర‌ణ్..!

ధృవ సినిమాతో స‌క్సెస్ సాధించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ సుకుమార్ తో చేస్తున్నారు. చ‌ర‌ణ్ - సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందే చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది.

హారిక & హాసిని బ్యాన‌ర్ లో ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీ..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత‌ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ప్ర‌య‌త్నం చేసారు. అయితే...అప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌వ‌ర్ స్టార్ తో మూవీ క‌మిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డం కుద‌ర‌లేదు కానీ.

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' గ్రాండ్ 30 రోజుల వేడుక

వైవిధ్యమైన కథాంశాలతో హిట్స్ సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం