ఆంధ్ర-తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో 'జిల్లా' - ఆర్.బి.చౌదరి

  • IndiaGlitz, [Sunday,July 26 2015]

స్విర్‌ జూబ్లీ (25 సంవత్సరాు) పూర్తి చేసుకొన్న సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ నుంచి 85వ సినిమాగా రూపొంది, తమిళంలో 100 రోజులకుపైగా ప్రదర్శితమైన జిల్లా' తెలుగులోనూ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో ఆడుతుండడం చాలా ఆనందంగా ఉందని, రేపటి నుంచి మరో పాతిక ధియేటర్లు పెంచుతున్నామని జిల్లా' సమర్పకులు, సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి అన్నారు. విజయ్‌-కాజల్‌-మోహన్‌లాల్‌-బ్రహ్మానందం ముఖ్య తారాగణంగా..

ఆర్‌.టి.నేసన్‌ దర్శకత్వంలో రూపొందిన జిల్లా' అదే పేరుతో తెలుగులో ఈనెల 24న విడుదలై- హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో రన్‌ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని' సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ కార్యాయంలో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.
ఈ సక్సెస్‌మీట్‌లో చిత్ర సమర్పకులు ఆర్‌.బి.చౌదరి, చిత్ర నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి-ప్రసాద్‌ సన్నితి, చిత్ర దర్శకుడు ఆర్‌.టి.నేసన్‌ పాల్గొని తమ సంతోషాన్ని వెల్లడించారు. జిల్లా' చిత్రానికి ఘన విజయం అందిస్తున్న ఆంధ్ర- తెలంగాణ ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రకటించారు.

తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌కి తెలుగులో తొలి బ్లాక్‌బస్టర్‌గా జిల్లా' నివడం తమకు ఎంతో గర్వంగా ఉందని, తమిళంలో విజయ్‌ తమ సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌లో 6 చిత్రాల్లో నటించాడని, అన్నీ సూపర్‌ హిట్టేనని ఆర్‌.బి.చౌదరి అన్నారు.
ఆర్‌.బి.చౌదరిగారు వంటి లెజండరీ ప్రొడ్యూసర్‌తో కలిసి' శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై తాము నిర్మించిన జిల్లా' డబ్బింగ్‌ సినిమా కేటగిరీలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి- ప్రసాద్‌ సన్నితి అన్నారు.

చౌదరిగారితో కలిసి త్వరలో ఓ స్ట్రయిట్‌ సినిమా ప్రొడ్యూస్‌ చేయనున్నామని వారు తెలిపారు. తమిళంలో జిల్లా' సాధించిన సంచలన విజయాన్ని తలపించేలా' తెలుగులో జిల్లా' రికార్డు స్థాయి కలెక్షన్స్‌ రాబడుతుండడం చాలా ఆనందంగా ఉందని చిత్ర దర్శకుడు ఆర్‌.టి.నేసన్‌ అన్నారు. టాలీవుడ్‌లోని పలువురు దర్శకులు జిల్లా' చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన ద్వారా వీక్షించి- తనకు ఫోన్‌ చేసి కంగ్రాట్స్‌ చెబుతుండడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉందని దర్శకుడు ఆర్‌.టి.నేసన్‌ చెప్పారు!

More News

ఆగస్టు 14న వస్తున్న 'సినిమా చూపిస్త మావ'

‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్తరుణ్-అవికాగోర్ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

ఆదితో పవన్ మరదలు...

ప్రేమకావాలి, లవ్ లీ, ప్యార్ మే పడిపోయానే, సుకుమారుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది ప్రస్తుతం గరమ్ సినిమా చేస్తున్నాడు.

హిట్ కాంబినేషన్ రిపీట్....

మాస్ మహారాజా రవితేజ, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ భద్ర పెద్ద హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

వెంకీ దర్శకుడి కొత్తచిత్రం

ప్రేమించుకుందాం..రా, ప్రేమంటే ఇదేరా, లక్ష్మీ నరసింహ, బావగారూ బాగున్నారా వంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా పేరు తెచ్చుకున్న జయంత్ సి.పరాన్జీ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది.

గుంటూరులో 'గ్యాంగ్స్ ఆఫ్ గుంటూర్ టాకీస్' ఇంట్రడక్షన్ ఈవెంట్..!!

నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రవీణ్ సత్తారు తాజాగా రూపొందిస్తున్న "గుంటూర్ టాకీస్"లోని గ్యాంగ్స్ ను.. విజయవాడ-గుంటూరు సమీపంలో గల "హాయ్ ల్యాండ్"లో ఆగస్టు 2న, ఫ్రెండ్ షిప్ డే