చిరంజీవి లేకుంటే ఏమైపోయేవాడినో: జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు

సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు నాలుగు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల విషయం తెలిసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రామ్మోహన్ నాయుడు ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. రామ్మోహన్ నాయుడికి ధైర్యం చెప్పడమే కాకుండా.. ఆయన కోలుకునేందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందేలా చేశారు. దీంతో రామ్మోహన్ నాయుడు అనారోగ్యం నుంచి కోలుకున్నారు.

తను కోలుకునేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించిన మెగాస్టార్‌ను శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘నేను ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నాను. గత నాలుగు నెలల నుంచి నాకు ఆరోగ్యం బాగోలేదన్నారు. కరీంనగర్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. మొదట జాండిస్ అని చెప్పారు. కానీ ఆ ట్రీట్మెంట్‌లో చాలా వీక్ అయ్యాను. మనుషులను కూడా గుర్తుపట్టలేదు. ఇడ్లీలో సగం కుడా తినలేని పరిస్థితికి చేరుకున్నాను.

మొత్తానికి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాను. నా అనారోగ్యం గురించి చిరంజీవిగారు తెలుసుకుని నన్ను ఇంటి నుంచి ఆసుపత్రిలో చేర్పించారు. నిజంగా ఇది నాకు పునర్జన్మ లాంటిది. చిరంజీవి గారు నా అనారోగ్యం గురించి తెలుసుకుని, స్వయంగా మా ఇంటికి వచ్చి పరామర్శించారు. అక్కడి వైద్యులు, చిరంజీవి గారి వల్లే నేను పూర్తిగా కోలుకున్నాను. చిరంజీవి గారు లేకుంటే నా పరిస్థితి ఏమై పోయి ఉండేదో. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్‌కు నా జన్మంతా రుణపడి ఉంటాను. అలాగే స్వామి నాయుడు, మెగా ఫ్యాన్స్ కు కూడా నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా చిరంజీవి గారు కూడా నా ఆరోగ్య విషయాలను అడిగి మరి తెలుసుకున్నారు అన్నారు.

More News

అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్రమాదం

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘కార్‌వాన్‌’కు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

'పుష్ప' షూటింగ్‌ అప్‌ డేట్‌

ఆర్య, ఆర్య 2 తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 'పుష్ప'.

నా సినిమా ఒక తండ్రికి ప్రేరణనివ్వడం ఆనందాన్నిచ్చింది: విజయశాంతి

ఒక పోలీస్‌ అధికారిణి.. క్రైమ్‌ రేటు, మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో విధులు...

చిన్న బ్రేక్ అంతే.. మ‌ళ్లీ వ‌స్తా: రామ్‌

ఈ  సంక్రాంతికి రెడ్ చిత్రంతో సంద‌డి చేసిన ఎనర్జిటిక్‌ స్టార్‌ హీరో రామ్‌.. నెక్ట్స్‌ మూవీ ఎంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

విశాఖ ఉక్కు.. వైసీపీనోరు మెదపదేం?

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానుందనే వార్త ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటు టీడీపీ నేతలు, అటు సామాన్య ప్రజానీకం మండిపడుతోంది.