close
Choose your channels

ఎన్టీఆర్ - కొరటాల మూవీ స్టోరీ లైన్ ఇదే.. !!

Wednesday, November 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ - కొరటాల మూవీ స్టోరీ లైన్ ఇదే.. !!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాస్త విరామం దొరకడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ - కొరటాల మూవీ స్టోరీ లైన్ ఇదే.. !!

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ రావడం.. కొరటా శివ ఇప్పటి వరకు తీసిన ఏ సినిమా కూడా పరాజయం కాకపోవడంతో సహజంగానే ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా కథ ఏమిటీ..? ఎవరెవరు నటించనున్నారు.. అనే విషయాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు ఇంటర్‌నెట్‌ను జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో వీటన్నింటికి ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు.

ఎన్టీఆర్ - కొరటాల మూవీ స్టోరీ లైన్ ఇదే.. !!

కొరటాలతో చేయనున్న సినిమా రివేంజ్ డ్రామా .. ఇది ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని యంగ్‌టైగర్ చెప్పారు. ఆరు .. ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఇక కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కూడా ఎన్టీఆర్ ఒక ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ నీల్‌తో సినిమా అక్టోబర్లో సెట్స్ పైకి వెళుతుందని.. ఇది 'కేజీఎఫ్' తరహాలోనే భారీ యాక్షన్ సినిమా" అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.