మళ్లీ బిగ్‌బాస్‌లోకి యంగ్ టైగ‌ర్‌

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

హిందీ నుండి తెలుగులోకి వచ్చిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇందులో తొలి సీజన్‌ను ఎన్టీర్‌ హోస్ట్‌ చేయగా రెండో సీజన్‌ను నాని హోస్ట్‌ చేశారు. అయితే ఇప్పుడు నిర్వాహకులు మూడో సీజన్‌ను హోస్ట్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.

మూడో సీజన్‌కు ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి సినిమా 'ఆర్‌ ఆర్‌ ఆర్‌ ' సినిమా చేస్తున్నారు. మరి దర్శకుడు రాజమౌళి బిగ్‌ బాస్‌ హోస్ట్‌ చేయడానికి అనుమతి ఇస్తాడా? అనేది తెలియాలి మరి. సీజన్‌ 3 హోస్ట్‌గా వెంకటేష్‌ పేరు కూడా ఇటీవల ప్రముఖంగా వినపడింది.