Jubilee Hills Rape Case : ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే అత్యాచారం... నిందితుల మాటలకు షాకైన పోలీసులు

  • IndiaGlitz, [Wednesday,June 15 2022]

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా అత్యాచారం కేసులో ఊహకందని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల విచారణలో రోజుకొక విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇంతటి దారుణానికి కారణం వెబ్‌ సిరీస్‌లు, ఇంగ్లీష్ సినిమాలేనట. ఈ విషయాన్ని నిందితులు పోలీసులకు తెలియజేశారు. జూబ్లీహిల్స్ బాలిక రేప్‌ కేసుకు సంబంధించి ఐదుగురు మైనర్ల కస్టడీని నిన్నటితో ముగించారు పోలీసులు. వాళ్ల నుంచి కీలక విషయాల్ని రాబట్టారు.

ముగిసిన ఐదు రోజుల కస్టడీ:

చార్జ్‌షీట్‌కి సరిపడా సమాచారం దొరికిందని, మళ్లీ కస్టడీని కోరమని చెబుతున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఐదురోజుల కస్టడీపై నివేదికను బుధవారం జువైనల్ కమిటీకి అందజేస్తారు. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్రభావంతోనే తాము ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు మైనర్లు. సెలవుల్లో వెబ్‌సిరీస్‌లు చూసి క్రైమ్ నేచర్‌కి అలవాటుపడ్డామని నిందితులు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంత చేసినా వాళ్ల దగ్గర పశ్చాత్తాపమే కనిపించలేదంటున్నారు.

నిందితుల తల్లిదండ్రులపైనా కేసులు:

మరోవైపు ఈ కేసులో నిందితుల తల్లిదండ్రులపైనా కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై అత్యాచారం జరిగినప్పుడు ఆ విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు సేకరించడంతో ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే, బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆ తర్వాత ఆధారాలను నాశనం చేసే ప్రయత్నం చేసినట్టు గుర్తించారు పోలీసులు.

ఇన్నోవా కారును తప్పించే యత్నం:

బాలికను తీసుకెళ్లిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ సంస్థ చైర్మన్ .. ఆ కారును డ్రైవర్‌కు అప్పగించారు. దీంతో అతడు దానిని మొయినాబాద్‌ సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఓ వ్యవసాయ క్షేత్రంలో పార్క్ చేసి పారిపోయాడు. ఆ క్షేత్రం ప్రభుత్వ సంస్థ చైర్మన్‌దేనని విచారణలో నిందితులు పోలీసులకు తెలియజేశారు.

More News

AP Govt: రెస్టారెంట్లు, హోటళ్లకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్... జనాలు ఖుషీ

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Chor Bazar: 'చోర్ బజార్' ఒక కలర్ ఫుల్ సినిమా - మూవీ టీం

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ

Sai Pallavi: విరాట పర్వం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'.

Sreeleela: రవితేజ 'ధమాకా' నుండి శ్రీలీల బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా"

యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ‘‘చోర్ బజార్’’

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది.