Kavitha: లిక్కర్ స్కాంలో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

  • IndiaGlitz, [Thursday,April 04 2024]

లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా.. ఈడీ తరపున జోసెఫ్ హుస్సేన్ వాదించారు. విచారణ సందర్భంగా కోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి.

16 ఏళ్ల వయసున్న కవిత చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. తల్లి అరెస్ట్ అయిందన్న ఆందోళనలో కుమారుడు ఉన్నాడని.. ఈ సమయంలో తల్లి పక్కనే ఉంటే కొంత మోరల్ సపోర్ట్ ఉంటుందన్నారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు ఉన్నందున కచ్చితంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని లేదంటే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సింఘ్వి వాదనలు వినిపించారు.

ఇదే సమయంలో కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని ఈడీ తరపు న్యాయవాది గట్టిగా వాదించారు. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రధాన సూత్రధారి అని.. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేయగల వ్యక్తి అని తెలిపారు. అవినీతి కార్యకలాపాలతో పాటు లిక్కర్ కేసుకు మూలమైన కవితకు బెయిల్ ఇవ్వకూడదని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారం ఉదయానికి రిజర్వ్ చేసింది. అలాగే సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని పేర్కొంది.

కాగా మార్చి 15న ఈ కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండగా తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి మారారు. ఇందులో భాగంగా తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర అని రూ.100కోట్లు చేతులు మారాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా అరెస్టై తిహార్ జైలులోనే ఉంటున్నారు.

More News

ఏపీలో బదిలీ అధికారుల స్థానంలో ఈసీ కొత్త నియామకాలు

ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Buddha Prasad: అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్.. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పు..

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పేరు ఖరారుతో పాటు రైల్వేకోడూరు అభ్యర్థిని మారుస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.

YSRCP: గ్రౌండ్‌లోకి దిగిన సీఎం జగన్.. గణనీయంగా పెరిగిన వైసీపీ గ్రాఫ్..

ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ దూసుకుపోతుంది. రాష్ట్రంలో ఎవరి నోట విన్నా జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాటే వినిపిస్తోంది.

తమిళ స్టార్ హీరో అజిత్‌కు కారు ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్..

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రొఫెసర్ రేసర్ అని తెలిసిందే. ఎక్కువగా బైక్‌పై ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అలాగే తన సినిమాల్లో కూడా యాక్షన్ సీక్వెన్స్ డూప్‌లు లేకుండానే చేస్తాడు.

Sonia Gandhi: రాజ్యసభ సభ్యులుగా సోనియా గాంధీ, తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ భవన్‌లో ఉపరాష్ట్రపతి జగ్‌దీఫ్ ధన్‌కర్‌ ఆమె చేత ప్రమాణం చేయించారు.