జూన్ మొదటివారంలో విడుదలకానున్న 'మాయామాల్'

  • IndiaGlitz, [Sunday,May 14 2017]

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటున్న "మాయామాల్" చిత్రాన్ని జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోవింద్ లాలం మాట్లాడుతూ.. "నేను మూడేళ్లపాటు కష్టపడి రాసుకొన్న కథ ఈ చిత్రం. కథ నచ్చి కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ లు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు రావడం, రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇక "మాయామాల్" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొంది" అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "అనుకున్నదానికంటే సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాలో విలన్ ఎవరనేది ఆసక్తికరమైన అంశం. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, జూన్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రేక్షకుల్ని మా చిత్రం తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు.
షకలక శంకర్, తాగుబోతు రమేష్, సోనియా, పృథ్వీరాజ్, నాగినీడు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: సతీష్ శెట్టి, యాక్షన్: విజయ్, కళ: రమణ వంక, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, సంగీతం: సాయికార్తీక్, నిర్మాతలు: కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: గోవింద్ లాలం!

More News

వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల వైజాగ్ లో జరిగింది.

'కేశవ'ఆడియో వేడుక

దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిఖిల్,రీతూవర్మ హీరో హీరోయిన్లుగా

సమంత స్థానంలో నిత్యా...

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్.

ఈనెల 20న సంపూర్ణేష్ బాబు 'వైరస్' ఆడియో విడుదల!

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్". "నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్" అనేది ట్యాగ్ లైన్.

ప్రతి పోలీసు కుటంబం చూడాల్సిన చిత్రం 'రాధ' - బివిఎస్ఎన్ ప్రసాద్

యువ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందిన చిత్రం `రాధ`.