close
Choose your channels

జూనియ‌ర్ బెల్లం క‌మింగ్‌!

Monday, August 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జూనియ‌ర్ బెల్లం క‌మింగ్‌!

బెల్లంకొండ జూనియ‌ర్... బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. ఒక‌ప్పుడు బొద్దుగా, ప్రొడ‌క్ష‌న్ వైపు బిజీగా ఉన్న ఈ బాబు త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి అన్నీ ప‌నులు చ‌క‌చ‌కా సాగుతున్నాయి. ఆల్రెడీ బెల్లంకొండ సీనియ‌ర్ సాయిశ్రీనివాస్ హీరోగా నిల‌దొక్కుకున్నారు. ఆయ‌న సినిమాల హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కు మంచి డిమాండే ఉంది. ఈ నేప‌థ్యంలో అన్న‌ను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకున్న గ‌ణేష్ బాగా స‌న్న‌గా, నాజూగ్గా త‌యార‌య్యారు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఇత‌ను హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌ని అంతా అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ ప‌వ‌న్ సాదినేనికి ద‌క్కింది. ప‌వ‌న్ సాదినేని గ‌తంలో `ప్రేమ ఇష్క్ కాద‌ల్‌`ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గ‌త కొన్ని నెల‌లుగా ఇత‌ను ప‌లు క‌థ‌లు చెప్పాడ‌ట గ‌ణేష్‌కు. ఫైన‌ల్‌గా ఒక స్క్రిప్ట్ ను లాక్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్ సాదినేనికి ఆల్రెడీ బెక్కం వేణుగోపాల్ అడ్వాన్స్ ఇచ్చార‌ట‌. సో ఇప్పుడు బెల్లంకొండ త‌న సొంత సంస్థ‌తో పాటు, బెక్కం వేణుగోపాల్‌తో క‌లిసి త‌న త‌న‌యుడి సినిమాను రూపొందిస్తార‌ని టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.