జూనియ‌ర్ బెల్లం క‌మింగ్‌!

  • IndiaGlitz, [Monday,August 19 2019]

బెల్లంకొండ జూనియ‌ర్... బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. ఒక‌ప్పుడు బొద్దుగా, ప్రొడ‌క్ష‌న్ వైపు బిజీగా ఉన్న ఈ బాబు త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి అన్నీ ప‌నులు చ‌క‌చ‌కా సాగుతున్నాయి. ఆల్రెడీ బెల్లంకొండ సీనియ‌ర్ సాయిశ్రీనివాస్ హీరోగా నిల‌దొక్కుకున్నారు. ఆయ‌న సినిమాల హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కు మంచి డిమాండే ఉంది. ఈ నేప‌థ్యంలో అన్న‌ను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకున్న గ‌ణేష్ బాగా స‌న్న‌గా, నాజూగ్గా త‌యార‌య్యారు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఇత‌ను హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌ని అంతా అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ ప‌వ‌న్ సాదినేనికి ద‌క్కింది. ప‌వ‌న్ సాదినేని గ‌తంలో 'ప్రేమ ఇష్క్ కాద‌ల్‌'ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గ‌త కొన్ని నెల‌లుగా ఇత‌ను ప‌లు క‌థ‌లు చెప్పాడ‌ట గ‌ణేష్‌కు. ఫైన‌ల్‌గా ఒక స్క్రిప్ట్ ను లాక్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్ సాదినేనికి ఆల్రెడీ బెక్కం వేణుగోపాల్ అడ్వాన్స్ ఇచ్చార‌ట‌. సో ఇప్పుడు బెల్లంకొండ త‌న సొంత సంస్థ‌తో పాటు, బెక్కం వేణుగోపాల్‌తో క‌లిసి త‌న త‌న‌యుడి సినిమాను రూపొందిస్తార‌ని టాక్‌.

More News

హీరో వెంక‌టేశ్‌కి స్వ‌ల్ప‌గాయం

విక్ట‌రీ వెంక‌టేశ్‌కి షూటింగ్‌లో చిన్న‌పాటి గాయాల‌య్యాయి. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ న‌టిస్తోన్న చిత్రం `వెంకీమామ‌`.

నిజమెంతో పూరియే చెప్పాలి?

కొత్త హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేయ‌డంలో పూరి ముందుంటారు. ఆయ‌న‌కున్న పూరి క‌నెక్ట్స్ సంస్థ స‌హ‌కారంతో ముంబై హీరోయిన్స్‌ను తెలుగులోకి ప‌రిచ‌యం చేశారు.

ఐదు భాష‌ల్లో సైరా

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న హిస్టారిక‌ల్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో

సెప్టెంబర్‌ 8న జరిగే తెలుగు సినీరథసారథులరజతోత్సవ వేడుకకు మా వంతు సహాకారం అందిస్తాం... సి కళ్యాణ్‌

సినీ నిర్మాణంలో ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ కీలక పాత్ర వహిస్తారు. అలాంటి తెలుగు సినీ ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ (టిసిపిఈయూ) స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా

'ఎవరు' లో పాత్రల ఎమోషన్స్‌కి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు - డైరెక్టర్ రామ్‌జీ

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `ఎవరు`. పివిపి సినిమా బ్యానర్‌పై వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో