తెలంగాణలో నిన్న ఒక్కరోజే షాకింగ్ స్థాయిలో మద్యం అమ్మకం

  • IndiaGlitz, [Wednesday,May 12 2021]

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడిందో లేదో... మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. క్షణాల్లోనే మందుబాబులు మద్యం దుకాణాలకు క్యూ కట్టారు. ఒక్కొక్క షాపు వద్ద వందలాది మంది గుమిగూడారు. సంచులతో ప్రత్యక్షమై మరీ వేల రూపాయలు వెచ్చించి మద్యం కొనుగోలు చేశారు. తమ అవసరాలకు మించి మద్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల లాక్ ప్రకటించడంతో మందుబాబులు ఈ పది రోజులకు సరిపడా మద్యాన్ని తీసుకువెళ్లేందుకు మద్యం షాపుల ముందు బారులు తీరారు.

Also Read: 10 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్

తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే అది కూడా హాఫ్ డేలోనే ఎంత మద్యం సేల్ అయ్యిందో తెలిస్తే షాక్ అవక మానరు. లాక్ డౌన్ ప్రకటన నిన్న మధ్యాహ్నం 2 గంటల తర్వాత వెలుపడింది. క్షణాల్లో అంటే మూడు గంటల వరకు 56 కోట్ల రూపాయల విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయ్యింది. ఆ తరువాత పెద్ద మొత్తంలో అమ్మకాలు జరగాయి. సుమారు రూ.125 కోట్ల మద్యం నిన్న ఒక్కరోజేర అమ్ముడైంది. కాగా.. తెలంగాణలోని జిల్లాల్లో రంగారెడ్డిలోనే అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగాయి. మే నెలలో ఇప్పటి వరకు జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు అయితే.. నిన్న ఒక్కరోజు జరిగిన మద్యం అమ్మకాలు ఒక ఎత్తు కావడం గమనార్హం.

మే నెల 10 రోజుల్లో రూ.676 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే రోజుకు సుమారు రూ.61 కోట్ల మేరకు అమ్మకాలు జరిగాయి. అయితే మంగళవారం ఒక్కరోజే రెట్టింపు అమ్మకాలు జరిగాయని దుకాణదారులు వెల్లడించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.24 కోట్లకు పైగా అమ్మకాలు జరగా.. వరుసగా నల్గొండలో రూ.15.24 కోట్లు, ఖమ్మంలో రూ.12.25 కోట్లు, హైదరాబాద్‌లో రూ.10.17 కోట్ల విక్రయాలు జరిగాయి. రద్దీని బట్టి అదనంగా సరుకు తెప్పించుకున్నామని దుకాణదారులు తెలిపారు. మరోవైపు.. డిపోల్లోనూ అధికారులు, సిబ్బందిని అబ్కారీ శాఖ అప్రమత్తం చేసింది. ఇండెంటు పెట్టిన వెంటనే మద్యం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.

More News

తారక్‌తో మాట్లాడాను.. ఆ విషయం తెలిసి సంతోషించా: చిరంజీవి

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు ఇటీవల కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తారక్ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు.

15 రోజుల తర్వాత కుటుంబాన్ని కలిసిన బన్నీ.. వీడియో వైరల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నాడు. 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన బన్నీకి కొడుకు, కూతురు నుంచి ఘన స్వాగతం లభించింది.

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఈటల.. రోజుకో నేతతో భేటీ

కరోనా సమయాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

10 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్

తెలంగాణలో లాక్‌డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలు, కార్యాలయాలపై పడుతోంది. మరోవైపు దేవాలయాలు సైతం మరోసారి మూతబడ్డాయి.

ఏపీలో రంజాన్‌ పండుగ మార్గదర్శకాల విడుదల

విజయవాడ: కరోనా కర్ఫ్యూ దృష్ట్యా రంజాన్‌ పండుగ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.