జ్యోతిక త‌దుప‌రి చిత్రం..

  • IndiaGlitz, [Wednesday,September 12 2018]

న‌టి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో మహిళా ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. '36 వ‌య‌దినిలే, మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌, నాచియార్‌, చెక్క‌చివ్వంద వాన‌మ్‌(న‌వాబ్‌), కాట్రిన్ మొళి (బాలీవుడ్ మూవీ తుమ్హారీ సులు)'  చిత్రాల్లో న‌టిస్తున్నారు. 'కాట్రిన్ మొళి' చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యిందో లేదో మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో జ్యోతిక న‌టించ‌డానికి సిద్ధ‌మైపోతున్నారు.

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై డెబ్యూ డైరెక్ట‌ర్ ఎస్‌.రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే మిగిలిన న‌టీన‌టుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తార‌ట‌.