Download App

జ్యోతిక త‌దుప‌రి చిత్రం..

న‌టి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో మహిళా ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. `36 వ‌య‌దినిలే, మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌, నాచియార్‌, చెక్క‌చివ్వంద వాన‌మ్‌(న‌వాబ్‌), కాట్రిన్ మొళి (బాలీవుడ్ మూవీ తుమ్హారీ సులు)`  చిత్రాల్లో న‌టిస్తున్నారు. `కాట్రిన్ మొళి` చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యిందో లేదో మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో జ్యోతిక న‌టించ‌డానికి సిద్ధ‌మైపోతున్నారు.

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై డెబ్యూ డైరెక్ట‌ర్ ఎస్‌.రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే మిగిలిన న‌టీన‌టుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తార‌ట‌.