ఆడపిల్లల నిర్ణయాలను గౌరవించాలనే 'కాదలి'

  • IndiaGlitz, [Wednesday,June 14 2017]

చాలా మంచి మెసేజ్ ఉన్న చిత్ర‌మిది. చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆడియోకి మంచి స్పంద‌న వ‌చ్చిందని హీరో సాయిరోన‌క్ తెలిపారు. పూజా కె. దోషి, హ‌రీశ్ క‌ల్యాణ్‌, సాయి రోణ‌క్‌, సుద‌ర్శ‌న్‌, మోహ‌న్ రామ‌న్‌, డా. మంజేరి ష‌ర్మిల‌, గురురాజ్ మానేప‌ల్లి త‌దిత‌రులు న‌టించిన సినిమా 'కాద‌లి'. ప‌ట్టాభి.ఆర్‌.చిలుకూరి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్ర‌వారం విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఇంత మంచి సినిమాలో భాగ‌మ‌వుతాన‌ని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంద‌ని పూజా తెలిపారు.

యువ‌కుల‌కు బాగా న‌చ్చే అంశంతో ఈ సినిమా చేశాం. ఇద్ద‌రు అబ్బాయిలు, ఓ అమ్మాయి మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. శ్రీలంక‌లో ఓ రిస్కీ ప్లేస్‌లో మా నాయిక డ్యాన్స్ చేసింది. ఈ సినిమా హీరోలు ఇద్ద‌రు ఒక‌రికి ఒక‌రు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఉంటారు. ఫీమేల్ సెంట్రిక్ సినిమా అన‌గానే బ‌రువైన క‌థ అని అనుకోవ‌ద్దు. నేటి స‌మాజానికి చ‌క్క‌గా స‌రిపోయే క‌థ ఇది. కాద‌లి అనే ప‌దం ద్ర‌విడ ప‌దం అని ఓ ఇంటర్వ్యూలో వేటూరిగారు అన్నారు. అందుకోసం ఈ ప‌దాన్ని మా టైటిల్‌గా వాడామ‌ని ద‌ర్శ‌కుడు ప‌ట్టాభి ఆర్. చిలుకూరి అన్నారు.

More News

లండన్ బాబుల వీసా కష్టాలు..

రక్షిత్, స్వాతి జంటగా రూపొందిన చిత్రం `లండన్ బాబులు`. చిన్నికృష్ణ దర్శకుడు. మారుతి నిర్మాత. మారుతి టాకీస్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో బుధవారం జరిగింది.

బాహుబలి కిరణ్ రాజ్ హీరోగా 'కరాళి' చిత్రం ప్రారంభం

ఎమ్.జె.మోషన్ పిక్చర్స్ పతాకంపై మల్లిఖార్జున్ రెడ్డి,మొహమ్మద్ జాఫర్ అలీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కరాళి.

'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' చిత్రం ప్రారంభోత్సవం

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సక్సెస్ తో టాప్ ఫాంలో దుసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే దువ్వాడ జగన్నాథం చిత్రంతో సరికొత్త రూపంలో మరో బ్లాక్ బస్టర్ చిత్రం అందించబోతున్న సంగతి తెలిసిందే.

శివగామిగా మధుబాల..

రోజా,శంకర్ జెంటిల్ మేన్,అల్లరి ప్రియుడు చిత్రాలతో తెలుగు తమిళ ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటి మధుబాల

డీజేపై మినిష్టర్ కు కంప్లైంట్.....

స్లైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథమ్'.