కాళ‌హ‌స్తిలో క‌బాలి పూజ‌లు..

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రాల నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించారు. టీజ‌ర్ నుంచి మూవీ రిలీజ్ వ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని రికార్డులు సొంతం చేసుకున్న క‌బాలి సినిమా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఓ పెను సంచ‌ల‌నం.

100 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిన క‌బాలి 200 కోట్ల బిజినెస్ చేసింది. 500 కోట్లకు పైగా వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా. ఇంత‌టి భారీ చిత్రాన్ని నిర్మించిన క‌బాలి నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను ఈరోజు శ్రీకాళ‌హ‌స్తి లో ర‌జ‌నీకాంత్ పేరు మీద రుద్రాభిషేకం పేరుతో ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. రిలీజ్ కి ముందే ఇంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క‌బాలి రిలీజ్ త‌ర్వాత ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

కబాలి ఫస్ట్ రివ్యూ...

కబాలి..కబాలి..కబాలి ఎక్కడ విన్న ఇదే మాట. ఇప్పటి వరకు ఏ సినిమాకి రానంత క్రేజ్ కబాలికి వచ్చింది. ఆకాశమే హద్దుగా అంచనాలను ఏర్పరుచుకున్న కబాలి రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

కబాలి రిలీజ్ కి క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.

కబాలి రిలీజ్ కి అడ్డంకులు..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఈనెల 22న అనగా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాలి.అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు కబాలి చిత్రాన్ని చూస్తామా అని ఎదురు చూస్తుంటే...

నాగ్ సెట్ లో సంద‌డి చేసిన ప్ర‌గ్యా

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

కబాలి ఓ సునామి..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించిన కబాలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది.