అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్ధితి.. హెల్త్ బులెటిన్ విడుదల

  • IndiaGlitz, [Saturday,November 20 2021]

దిగ్గజ న‌టుడు కైకాల స‌త్యనారాయ‌ణ (86) ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంది. ప్రస్తుతం అపోలో ఆసుప‌త్రిలో వెంటిలేట‌ర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్‌తో బాధపడుతున్నారని అపోలో వర్గాలు హెల్త్ బులెటిన్‌లో తెలిపాయి. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని.. చికిత్సకు కైకాల స్పందించడం లేదని వైద్యులు వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితం ఆయ‌న ఇంట్లో జారిప‌డి హాస్పిట‌ల్‌లో చేరారు. చికిత్స అనంతరం కోలుకున్న ఆయన మ‌రోసారి అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, క‌మెడియ‌న్‌గా ఇలా అన్నీ ర‌కాల ప్రాత‌ల‌ను పోషించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు కైకాల సత్యనారాయణ.

60 ఏళ్ల సినీ ప్రస్థానంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా కైకాలను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదుతో అభిమానులు పిలుచుకుంటూ వుంటారు. రాజకీయాలపై ఆసక్తితో 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు.

More News

ఆడపడుచులపై దూషణలు.. అరాచక పాలనకు నాందీ : ఏపీ అసెంబ్లీ ఘటనపై ఎన్టీఆర్ ఎమోషనల్

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం సభలో జరిగిన పరిణామాలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.

మంత్రి తలసాని  క్లాప్ తో 'మిస్సమ్మ' చిత్రం ప్రారంభం

శ్రీ వేంకటేశ్వర సాయి క్రియేషన్స్ హరి ఐనీడి, రమ్య కొమ్మాలపాటి నిర్మాతలుగా భారీ బడ్జెట్ అండ్ సాహసంతో కూడుకున్న

‘దృశ్యం-2’ రిలీజ్‌లో ట్విస్ట్: లీగల్ ఫైట్‌కు రెడీ అయిన ఓటీటీ సంస్థ..?

విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సినీనటి చౌరాసియాపై దాడి : మిస్టరీని ఛేదించిన పోలీసులు.. నిందితుడు అరెస్ట్

హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో వర్థమాన సినీనటి షాలు చౌరాసియాపై దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.

భార్యపై కామెంట్స్... చంద్రబాబు కంటతడి, సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీకి వస్తానంటూ శపథం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ  సమావేశాలు రెండో రోజు వాడీవేడిగా సాగాయి.