'కప్పేలా' రీమేక్ లో ఖైదీ, మాస్టర్ విలన్ అర్జున్ దాస్.. సితార బ్యానర్ లో..

  • IndiaGlitz, [Wednesday,July 07 2021]

తమిళ నటుడు అర్జున్ దాస్ పేరు ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. హీరో కార్తీ నటించిన ఖైదీ, విజయ్ మాస్టర్ చిత్రాల్లో అర్జున్ దాస్ విలన్ రోల్స్ చేశాడు. విలన్ గా అర్జున్ దాస్ మాస్ స్టైలిష్ పెర్ఫామెన్స్ అందరిని మెప్పించింది. ఇప్పుడు అర్జున్ దాస్ టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మలయాళీ బ్లాక్ బస్టర్ 'కప్పేలా' చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయమే త్రివిక్రమ్ చేతుల మీదుగా ఈ మూవీ లాంచ్ అయింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకరు పాజిటివ్ లక్షణాలు ఉండే హీరో మరొకరు నెగిటివ్ లక్షణాలు ఉండే హీరో.

ఇదీ చదవండి: రామ్-లింగుసామి కాంబినేషన్‌లో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్

అర్జున్ దాస్ నెగిటివ్ లక్షణాలు ఉండే హీరో పాత్రలో నటించబోతున్నాడు. సిద్దు జొన్నలగడ్డ పాజిటివ్ గా ఉండే హీరో పాత్రలో కనిపిస్తాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమ కథ ఈ చిత్రం. ఈ ఇద్దరు హీరోలు, హీరోయిన్ మధ్య ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ.

ముస్తఫా దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన కప్పేలా మలయాళంలో ఘనవిజయం అందుకుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తోంది. చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడు. ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ బ్యానర్ లో నాగవంశీ వరుస చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సితార బ్యానర్ నుంచి నితిన్ రంగ్ దే విడుదలయింది. ప్రస్తుతం పవన్, రానా నటిస్తున్న చిత్రం తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని, సితార సంస్థల నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ లకు మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ తో గొప్ప సాన్నిహిత్యం ఉంది.