తేజ చిత్రంలో మరోసారి కాజల్ అగర్వాల్‌..?

  • IndiaGlitz, [Friday,July 17 2020]

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ ... ఒక‌ప్పుడు చిత్రం, నువ్వు నేను, జ‌యం వంటి ప్రేమ‌క‌థా చిత్రాల‌తో వ‌రుస విజయాల‌ను అందుకున్నాడు. ల‌వ్‌స్టోరీస్‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట‌గా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ త‌ర్వాత స‌క్సెస్‌ల‌ను సాధించ‌డంలో వెనుక‌బ‌డ్డాడు. ఇక తేజ అనే డైరెక్ట‌ర్ లేడేమో అని అనుకుంటున్న స‌మ‌యంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో స‌క్సెస్ సాధించి మ‌ళ్లీ త‌న ఉనికిని చాటుకున్నాడు. సీనియ‌ర్ ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'ను తెర‌కెక్కించాల్సింది కానీ.. ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు. కానీ త‌ర్వాత తేజ తెర‌కెక్కించిన 'సీత‌' బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈయ‌న త‌దుప‌రి సినిమాల‌పై ప‌లు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే తెలుగులో రానాతో ఓ సినిమా, గోపీచంద్‌తో మ‌రో సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో తేజ బిజీగా ఉన్నాడు. ఇందులో గోపీచంద్‌తో ‘అలివేలుమంగ వెంక‌ట‌ర‌మ‌ణ’ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌నే దానిపై తేజ చాలా క‌స‌రత్తే చేశాడ‌ట‌. అనుష్క‌, కాజ‌ల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో గోపీచంద్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. ల‌క్ష్మీ క‌ల్యాణం సినిమాతో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను తేజ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి, సీత’ చిత్రాల్లో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించింది. అదీగాక గోపీచంద్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌లేదు. వీరి జోడీ ఫ్రెష్‌గా ఉంటుందని తేజ భావించడంతో గోపీచంద్ జోడీగా కాజల్‌ను ఓకే చేశారని టాక్.

More News

క‌రోనాను లెక్క చేయ‌ని కిచ్చా సుదీప్

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచం స్త‌బ్దుగా మారింది. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ దారుణంగా దెబ్బతింది. సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి.

మీడియా ముందుకు కేసీఆర్!.. వరాలుండేనా?

ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా వైరస్ తెలంగాణను తాకిన తొలి నాళ్లలో ఆయన నాలుగు రోజులకొకసారి

బాల‌కృష్ణ‌పై వ‌ర్మ సినిమా?

బాల‌కృష్ణ‌పై రామ్‌గోపాల్ వ‌ర్మకు చెప్ప‌రాని కోపం అయితే ఉంది. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌ర‌సం లేదు.

ర‌జినీ పొలిటిక‌ల్ అనౌన్స్‌మెంట్ అప్పుడేనా?

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమాల నుండి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

ఓటీటీలో త‌మ‌న్నా, కాజ‌ల్ సినిమా!!

2014లో హిందీలో వచ్చిన ‘క్వీన్’ సినిమా నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లోనూ రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే.