అల్ల‌రోడి జ‌త‌గా చంద‌మామ‌

  • IndiaGlitz, [Monday,March 09 2020]

అల్ల‌రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటిత‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు సంపాదించుకుని యాబై సినిమాల‌ను పూర్తి చేశాడు అల్ల‌రి న‌రేశ్‌. అయితే ఈ మ‌ధ్య హీరోగా అల్ల‌రి న‌రేశ్‌కు పెద్ద‌గా స‌క్సెస్‌లు లేవు. దీంతో క్యారెక్ట‌ర్‌గా న‌టుడిగా కూడా మారాడు ఈ అల్ల‌రోడు. మ‌హేశ్ స్నేహితుడిగా న‌రేశ్ న‌టించిన తాజా చిత్రం మ‌హ‌ర్షి కూడా భారీ విజ‌యాన్ని సాధించింది. మ‌రో ప‌క్క‌న హీరోగా సినిమాలు కూడా చేస్తున్న న‌రేశ్ ప్ర‌స్తుతం బంగారుబుల్లోడు, నాంది సినిమాలు చేస్తున్నాడు. వీటిలో బంగారు బుల్లోడు సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంటే.. నాంది సినిమా షూటింగ్ జ‌రుగుతుంది.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు న‌రేశ్ ఓ కొరియ‌న్ రీమేక్‌లో న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. వివ‌రాల మేర‌కు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సురేష్‌బాబు ఓ కొరియ‌న్ సినిమాను రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ చిత్రంలో హీరోయిన్‌దే ప్ర‌ధాన భూమిక. ఆ పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను న‌టింప చేయాల‌ని సురేశ్ బాబు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. ఇండియ‌న్ 2 త‌ర్వాత మ‌రో సినిమాలో న‌టించ‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రి సురేశ్‌బాబు ఆఫ‌ర్‌కి ఓకే చెబుతుందా?.. ఒక‌వేళ ఆమె ఓకే చెప్పినా ఆమె ఓకే చెప్పే భారీ రెమ్యున‌రేష‌న్‌ని ఇవ్వ‌డానికి సురేశ్‌బాబు ఓకే అంటాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

More News

తెలంగాణ వార్షిక బడ్జెట్ 2020-21.. కేటాయింపులు ఇవీ..

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2020-21ను ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

మనం అరుదుగా చూసే సినిమాల్లో ఒకటి ‘మధ’: ర‌కుల్ ప్రీత్ సింగ్‌

ఒక‌టి, రెండు అవార్డులు కావు.. ఏకంగా 26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న చిత్రం ‘మ‌ధ‌’.

మ‌రో యంగ్ డైరెక్ట‌ర్‌కి నాని గ్రీన్ సిగ్న‌ల్‌..?

నేచుర‌ల్ స్టార్ నాని ఒక‌వైపు హీరోగా, మ‌రో వైపు నిర్మాత‌గా ఫుల్ స్పీడుమీదున్నాడు. రీసెంట్‌గా నిర్మాత హిట్‌తో హిట్ అందుకున్నాడు నాని.

‘థాంక్యూ’ అనబోతున్న చైతన్య!

అక్కినేని నాగచైత‌న్య ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

రామ్ ఆ డైరెక్ట‌ర్‌కి ఓకే చెబుతాడా?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం ‘రెడ్’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే రామ్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ..