కంట్రోల్ చేసుకుంటున్న కాజల్

  • IndiaGlitz, [Thursday,May 12 2016]

బ్రహ్మోత్సవం టీజర్లో కాజల్ కనిపించిన తీరు ఆసమ్. ఈ నెల 20న ఆ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దాంతో ప్రస్తుతం కాజల్ తన హిందీ చిత్రం మీద దృష్టి పెట్టింది. ఆ చిత్రంలో భాగంగానే ఇప్పుడు బ్రెయిలీ నేర్చుకుంటోంది. దీని గురించి కాజల్ చెప్తూ ''డో లఫ్జాన్ కి కహానీ ప్రిపరేషన్ లో భాగంగానే నేను ప్రస్తుతం బ్రెయిలీ నేర్చుకుంటున్నాను. హెల్లెన్ కెల్లర్ పుస్తకాలను చదువుతున్నాను. కొన్ని రెఫరెన్స్ పుస్తకాలను చదువుతున్నాను, చాలా చిత్రాలను చూస్తున్నాను, సెంట్ జేవియర్ కాలేజీలో ఎక్స్ ఆర్ సీవీసీ విభాగంలో ప్రత్యేకంగా వర్క్ షాప్ కు కూడా అటెండ్ అయ్యాను.

వీటన్నిటివల్ల అంధుల వ్యావహారిక శైలి ఎలా ఉంటుందో అర్థం చేసకోగలిగాను. దీనికి నాకు డా.శ్యామ్, కల్వీనా చాలా సాయం చేశారు. వాళ్లే నాకు బ్రెయిలీ నేర్పించారు. స్పెషల్ కంప్యూటర్స్, ఆడియో మెషిన్ల గురించి, మైక్రోవేవ్స్, వాచ్ లు, మొబైల్ ఫోన్ల గురించి సంపూర్ణంగా వివరించారు. అంధులు నడిచే విధంగా నడవడానికి నాకు కల్వీనా చాలా సాయం చేశారు. అన్నిటికీ కళ్లతో చూసి, ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి అలవాటైన నాకు, ఒక్క సారి కళ్లు మూసుకుని చీకట్లో పనులు చేయాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించినమాట వాస్తవమే. అయితే ఈ పాత్రకోసం తీసుకుంటున్న శిక్షణలో భాగంగా నా కళ్ళను తిప్పడం కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇందులో నా రెండుకళ్లు ఒకే వైపునకు తిప్పినట్టు కనిపిస్తాయి'' అని కంప్లీట్ డీటైల్స్ చెప్పేసింది కాజల్.

More News

చిరు 150వ చిత్రానికి హీరోయిన్ ఖరారు

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా నయనతార అయితే బాగుంటుంది అనుకున్నారు.

'ఒక మనసు' కథ ఆ సినిమాదేనా?

మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది నీహారిక.నాగబాబు గారాల పట్టి నీహారిక ఇప్పటికే పలు టీవీ షోలతో తెలుగు వారందరికీ సుపరిచితమే.

శ్రీదివ్యకి అప్పుడలా..ఇప్పుడిలా..

తెలుగమ్మాయి శ్రీదివ్య టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే బిజీగా మారింది.

సమంత కి మళ్లీ అచ్చొచ్చేనా?

ఈ తరంలో సమంత అంత లక్కీ హీరోయిన్ మరొకరులేరనే చెప్పాలి.చేసిన సినిమాల్లో దాదాపుగా హిట్సే ఉన్నాయి తనకి.అలాంటి హిట్స్ లో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ'.

'బ్రహ్మోత్సవం' మరో 'మురారి' కానుందా?

మహేష్ బాబు కెరీర్ లో మరపురాని చిత్రాలలో 'మురారి'ఒకటి.ఆ సినిమా విడుదలై 15ఏళ్లు పూర్తయినా..ఇప్పటికీ టీవీలో ఎప్పుడూ వచ్చినా ఆదరణకు తక్కువేమీ కాదు.