close
Choose your channels

రానా చిత్రంలో అతిథిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌..?

Friday, August 7, 2020 • తెలుగు Comments

రానా చిత్రంలో అతిథిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌..?

ద‌శాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. చంద‌మామ‌లాంటి అమ్మ‌డు న‌చ్చ‌డంతో ఈమెకు తెలుగులో అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. త‌ర్వాత తమిళంలో స్టార్స్‌తో క‌లిసి న‌టించింది. అలాగే బాలీవుడ్‌లోనూ రెండు మూడు సినిమాల్లో న‌టించింది. సీనియర్ హీరోలు, నేటి తరం అగ్ర కథానాయకులతో జోడీ కడుతూఇన్నేళ్ల‌యినా కాజ‌ల్ అగ‌ర్వాల్ కుర్ర హీరోయిన్స్‌కు పోటీనిస్తూ భారీ చిత్రాల్లో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడుకి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం సోషల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తుంది.

అదేంటంటే.. రానా హీరోగా ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘అర‌ణ్య‌’. ఇందులో రానా డిఫ‌రెంట్ పాత్ర‌లో న‌టించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో ఆదివాసీ యువ‌తిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింద‌ట‌. కాజ‌ల్ పాత్ర కాసేపే ఉంటుంద‌ట‌. కాసేపు క‌నిపించే పాత్రే అయినా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ రూ.70ల‌క్ష‌లు త‌గ్గ‌లేద‌ట‌. మూడు భాష‌ల్లో కాజ‌ల్ సుప‌రిచితురాలే కావ‌డంతో నిర్మాత‌లు కూడా కాజ‌ల్ అడిగిన మొత్తాన్ని చెల్లించారు.

Get Breaking News Alerts From IndiaGlitz