అవునా కాజ‌ల్‌... నిజంగా నిజ‌మేనా?

  • IndiaGlitz, [Tuesday,September 17 2019]

ఇప్పుడు కాజ‌ల్‌ని చూసిన వాళ్లు చాలా మంది వింత‌గా అచ్చం ఇలానే అడుగుతున్నారు. అవునా కాజ‌ల్‌.. నిజంగా నిజ‌మేనా? అని. ఎందుకంటే ఆమె తాజ్‌ని చూసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం చూసి, మ‌న జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎప్ప‌టి ల‌క్ష్మీ క‌ల్యాణం... అంత‌కు ముందంటే మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం, చ‌దువు, ఉద్యోగం అంటూ బిజీగా ఉంద‌నే అనుకుందాం. సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాతైనా చేతి నిండా డ‌బ్బులు, అనుకున్న‌ప్పుడు తీసుకున్న వెకేష‌న్లు... ఇన్నిటిలోనూ ఒక్క‌సారంటే ఒక్క‌సారి తాజ్‌మ‌హ‌ల్‌ను చూడాల‌ని అనిపించ‌లేదా కాజ‌ల్‌కు. ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు వెళ్ల‌డ‌మేంటి? అని జ‌నాలు నోళ్లు నొక్కుకుంటున్నారు. అయితే కాజ‌ల్ మాత్రం అదేమీ ప‌ట్ట‌న‌ట్టు.. త‌న ఎగ్జ‌యిట్‌మెంట్‌ను జ‌బ‌ర్ద‌స్త్ గా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తాజ్‌మ‌హ‌ల్‌ని తొలిసారి చూశాను. మెస్మ‌రైజ్ అయిపోయా. స్పెల్‌బౌండ్ అయిపోయా. అలా నోరెళ్ల‌బెట్టి నిల‌బ‌డిపోయా. ఆ భారీత‌నాన్ని, తాజ్ విశ్వ‌రూపాన్ని చూసి నాకు నోట మాట రాలేదు. నా చిన్న త‌నం నుంచి తాజ్ మ‌హ‌ల్ గురించి ఎంతో విన్నాను. చూసొచ్చిన వాళ్లు ఎన్నో విష‌యాలు చెప్పారు. కానీ నా అంత‌ట నేను, అక్క‌డ అడుగుపెట్టిన క్ష‌ణాలు అపురూప‌మైన‌వి. అద్భుత‌మైన‌వి. అక్క‌డ వినిపించే ధ్వ‌ని, తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణం, అందులో పొదిగిన విలువైన విష‌యాలు, ఆ క‌ట్ట‌డాలు.. కొంత‌సేపు న‌న్ను చ‌రిత్ర చుట్టిముట్టేసింది. నా మ‌న‌సులో తీయ‌టి అనుభూతిని మిగిల్చింది. వావ్ తాజ్‌'' అని కాజ‌ల్ పోస్ట్ చేసింది.

త‌న చిన్న త‌నం నుంచి ప్ర‌తి ఏడాదీ రెండు ట్రిప్‌ల‌కు త‌ల్లిదండ్రులు తీసుకెళ్లేవారు అని కాజ‌ల్ ప‌లుమార్లు ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పింది. వాటిలో ఒక‌టి స్వ‌దేశంలో ఉండ‌గా, మ‌రొక‌టి విదేశంలో ఉండేద‌నీ చెప్పారు. అయితే ఈ భామకు తాజ్‌ని ద‌ర్శించ‌డానికి ఇప్ప‌టికి కుదిరింద‌న్న‌మాట‌. ఏదైనా మ‌న దేశంలో ఉన్న ఏడో వింత‌ను చూసేసింద‌న్న‌మాట‌.

More News

'దేవత' సినిమాలాగే 'వాల్మీకి' కూడా 25 వారాలు ఆడాలి: కె. రాఘవేంద్రరావు

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే

అంతా మెగాస్టార్ వ‌ల్లే... అంటున్న సుదీప్‌

తాను ఆ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం మెగాస్టారే అని అంటున్నారు క‌న్న‌డ న‌టుడు సుదీప్‌. ఆయ‌న ఈ మ‌ధ్య ఇద్ద‌రు మెగాస్టార్ల‌తో క‌లిసి ప‌నిచేశారు. వారిలో ఒక‌రు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కాగా...

వాల్మీకి... ఆల్రెడీ హిట్టా?

వాల్మీకి ఆల్రెడీ హిట్ అయిందా? ఫుల్ లాభాల్లో ఉందా? అందుకే ఆ టీమ్ అంత ధీమాగా క‌నిపిస్తోందా? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన సినిమా వాల్మీకి.

ఆర్ ఆర్ ఆర్ మ్యూజిక్ సీక్రెట్‌

ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఏ విష‌య‌మైనా ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. అటు రాజ‌మౌళికి సంబంధించిందైనా అంతే ఇంట్ర‌స్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇటు హీరో, హీరోయిన్ల‌కు సంబంధించిందైనా అంతేన‌న్న‌మాట‌.

కోడెల-చంద్రబాబు ఫోన్ సంభాషణ.. బయటపెట్టిన మంత్రి!

టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మరణం ప్రభుత్వం వల్లేనని టీడీపీ.. మేం ఆయన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదని అధికార పార్టీ నేతలు.. ఇలా