నాగ్ చిత్రంలో కాజల్...

  • IndiaGlitz, [Saturday,July 08 2017]

కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇప్పుడు నాగార్జున చిత్రంలో న‌టించ‌నుంది. నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'రాజుగారి గ‌ది2'. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మంచి విజ‌యం సాధించిన 'రాజుగారిగ‌ది' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతుంది. ప్ర‌సాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. ఈ పాత్ర కోసం కాజ‌ల్ 10రోజుల కాల్ష్‌షీట్‌ను కేటాయించింద‌ని స‌మాచారం. ఇందులో స‌మంత దెయ్యం పాత్ర‌లో న‌టిస్తుంద‌ట‌. ఈ చిత్రంలో ఎదుటివారి మ‌న‌స్త‌త్వాల‌ను చ‌దివే మాన‌సిక నిపుణుడి పాత్ర‌లో నాగార్జున న‌టిస్తాడ‌ట‌. అల్రెడి విడుద‌లైన నాగార్జున లుక్స్‌కు ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అవ‌య‌వ‌దానంపై రాజుగారిగ‌ది చిత్రాన్ని తెర‌కెక్కించిన ఓంకార్ ఈ చిత్రంలో ఎలాంటి మెసేజ్ ఇస్తాడోమ‌రి చూడాల్సిందే.

More News

ఎన్టీఆర్ ఆనందం....

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'జైలవకుశ`.

జులై నాలుగోవారంలో 'ఉంగరాల రాంబాబు' విడుదల

వరుస కమర్షియల్ సక్సస్ లు తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా,

బిగ్ బాస్ కు , కంటెస్టెంట్స్ కు మధ్య నేను వారధిగా ఉంటాను - ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు బుల్లితెర వైపు అడుగులేస్తున్నారు.

మూడు రోజుల పరిణయం...

ఒకప్పుడు పెళ్ళి చేసుకోవాలంటే 16 రోజులు చేసుకునేవారట.

'మహానటి' కోసం హాలీవుడ్ కెమెరామెన్!!

లెజండరీ నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగఅశ్విన్ తెరకెక్కిస్తున్న బయోపిక్ 'మహానటి'.ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ 'స్వప్న సినిమా' పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.