భర్తతో కాజల్ లాంగ్ డ్రైవ్.. ప్లానింగ్ లేకుండా కారెక్కారు!

  • IndiaGlitz, [Monday,June 28 2021]

గత ఏడాది కాజల్ అగర్వాల్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుని కాజల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తన భర్తతో కలసి సంతోషంగా ఉన్న క్షణాలని కాజల్ తరచుగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.

ఇదీ చదవండి: ఐదేళ్లుగా సహజీవనం.. నయనతార ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..

తాజాగా గౌతమ్ ఓ క్రేజీ పిక్ ని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా తామిద్దరం అద్భుతమైన లాంగ్ డ్రైవ్ కి వెళ్లినట్లు తెలిపాడు. జీవితంలో చాలా ఉత్తమమైనవి అన్నీ ప్లానింగ్ లేకుండానే జరిగిపోతాయి. ముంబైలో పడుతున్న వర్షాలకు థాంక్స్. మేమిద్దరం లాంగ్ డ్రైవ్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యాం.

కొన్ని సార్లు దారి తప్పడం ద్వారా అందమైన ప్రదేశాలని కనుగొనవచ్చు. మీకు కూడా ఇలా జరగాలంటే గూగుల్ మ్యాప్స్ ని వదిలిపెట్టండి అని గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కాజల్ తో కలసి కారులో ప్రయాణిస్తున్న స్టిల్ పోస్ట్ చేశాడు.

ఈ పిక్ లో ఇద్దరూ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ చివరిదశలో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

More News

ఐదేళ్లుగా సహజీవనం.. నయనతార ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..

ప్రస్తుతం ఇండియాలో హాటెస్ట్ కపుల్స్ లో నయనతార, విగ్నేష్ శివన్ జంట ఒకటి. వీరిద్దరూ 2015 నుంచి సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఐఐటీ కాన్పూర్ అధ్యయనం.. సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ విధ్వంసమే!

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం నుంచి కొంత వరకు బయటపడగలిగాం. ఇప్పుడు థర్డ్ వేవ్ పై దేశ ప్రజల్లో ఆందోనళ నెలకొని ఉంది.

'మా' బరిలో ఊహించని వ్యక్తి.. విజయశాంతి సపోర్ట్!

త్వరలో జరగబోయే మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటోంది.

'స్టార్ మా' సంచలనం.. వందల కోట్ల బిజినెస్ చిత్రాలన్నీ..

తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో 'స్టార్ మా' ఒకటి.

సమంత అతడితో నటించిన రొమాంటిక్ సీన్లు డిలీట్!

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అఖండ విజయం సొంతం చేసుకుంది.