close
Choose your channels

పెళ్లి చేసుకోవాలంటే ట్రై చేయండి.. కాజల్ రిప్లై!

Friday, September 20, 2019 • తెలుగు Comments

పెళ్లి చేసుకోవాలంటే ట్రై చేయండి.. కాజల్ రిప్లై!

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా సినీ ఇండస్ట్రీనే ఏలేస్తోంది కాజల్ అగర్వాల్.. ఇలా జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా రెండు, మూడు జనరేషన్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ నటించేసి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈ మధ్య ఈ భామ పెళ్లి, లవ్‌పై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో కాస్త హింటిచ్చి ఈ బ్యూటీ మాట్లాడినప్పటికీ క్లారిటీ మాత్రం రావట్లేదు.. ఇటీవల తాజ్ మహల్‌ దగ్గరికెళ్లి లవ్ సింబల్‌తో ఏదో చెప్పాలనుకుంది.. అసలు విషయం చెప్పకుండా మళ్లీ టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించింది.

దీంతో.. కాజల్ ఫ్యాన్స్, సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా పెళ్లి, లవ్‌పై పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే ఈ భామ నెటిజన్ల ప్రశ్నలకు సరదాగా అప్పుడప్పుడు రిప్లై ఇస్తుంటుంది. తాజాగా.. ఓ వీరాభిమాని ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ పెట్టాడు.. అందుకు కాజల్ కూడా ట్రై చేస్కోండి అంటూ రిప్లై ఇచ్చింది.

ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇదీ..!

అభిమాని: నేను మిమ్మల్ని పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నాను. మరి మీరు ఏమి సమాధానం చెబుతారు?

కాజల్: ‘మీరు నన్ను పెళ్లి చేసుకోవాలంటే కొంచెం ప్రయత్నం చేయండి. అంత సులభంగా జరగదు’ అని అతని ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే.. వీరాభిమాని ఏదో అలా టైమ్‌ పాస్‌కు పెట్టిన కామెంట్‌కు కాజల్ రిప్లై ఇవ్వడం విశేషమని చెప్పుకోవచ్చు. కాజల్ నుంచి రిప్లై రావడంతో సదరు అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. కాగా.. ఇటీవల ‘కవచం’, ’సీత’ ‘రణరంగం’ సహా అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలను సాధించలేదు. మరోవైపు.. ‘ప్యారిస్ ప్యారిస్’ అనే తమిళ సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. ప్రస్తుతం హిందీలో ‘ముంబాయి సాగ’ సినిమాలో నటిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz