close
Choose your channels

మంచు విష్ణు చెల్లి పాత్ర‌లో కాజ‌ల్‌

Friday, August 16, 2019 • తెలుగు Comments

మంచు విష్ణు చెల్లి పాత్ర‌లో కాజ‌ల్‌

మంచు విష్ణు హీరోగా నటిస్తూ.. నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తూ ఓ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇప్పటికే వెలువడింది కూడా. ఇండియా ఐటీ కంపెనీలో జరిగిన రూ.2800కోట్ల స్కామ్ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రిన్ చిన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.ఈ చిత్రంలో మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ హీరోయిన్ రుహా సింగ్ మంచు విష్ణు జతగా నటిస్తుంది. `క్యాలెండర్ గర్ల్స్`, `ఇష్క్ ఫర్ ఎవర్` వంటి బాలీవుడ్ సినిమాల్లో ఈమె హీరోయిన్‌గా నటించారు. కాగా హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ చిత్రంలో మంచు విష్ణు చెల్లెలు పాత్రలో న‌టిస్తుంది. రక్షాబంధ‌న్ రోజు వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ ఈ విష‌యాన్ని తేట‌తెల్లం చేసింది.

Get Breaking News Alerts From IndiaGlitz