close
Choose your channels

పెళ్లి వదంతులపై క్లారిటీ ఇచ్చేసిన కాజల్

Friday, December 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పెళ్లి వదంతులపై క్లారిటీ ఇచ్చేసిన కాజల్

సినీ ఇండస్ట్రీలో మోస్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో.. టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన కాజల్ అగర్వాల్ కూడా ఉంది. ఈ చందమామ ఇప్పటికీ పెళ్లి అంటే చాలు అప్పుడేనా అన్నట్లుగా మాట్లాడుతోంది. అయితే ఓ బడా బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకోనుందని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఓ బడా బిజినెస్‌మెన్‌తో లవ్‌లో పడిందని.. అయితే ఆ విషయం బయటికి పొక్కనీయకుండా ఇన్ని రోజులుగా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వచ్చిందట. అదే కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా.. అందుకే పెళ్లి చేసుకోవాల్సిన టైమ్ కాజల్‌కు వచ్చేసిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది లాస్ట్ లేదా 2020 సంక్రాంతి తర్వాత పెళ్లి చేసుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోందని కూడా వార్తలు గుప్పుమన్నాయి.

అయితే పెళ్లి వదంతులపై తాజాగా ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చుకుంది. శుక్రవారం నాడు విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమెను పెళ్లి గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా.. కుండబద్ధలు కొట్టేసింది. ‘ నా పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలు అవాస్తవాలే.. అవన్నీ వదంతులే. ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దు. నా పెళ్లి గురించి నేనే స్వయంగా మీడియాకు తెలియజేస్తాను’ అని క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి చూస్తే ఇన్ని రోజులుగా వస్తున్న పుకార్లన్నింటికీ ఈ భామ సింగిల్ మాటతో ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఇకనైనా ఈ చందమామపై పుకార్లు ఆగుతాయో లేదో మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.