సింగర్ గా మారుతున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Wednesday,January 06 2016]

హీరోలు, ద‌ర్శ‌కులు...అప్పుడ‌ప్పుడు కొత్త అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిస్తుండ‌డం చూస్తున్నాం. తాజాగా ఓ హీరోయిన్ సింగ‌ర్ గా మారి ఓ పాట పాడ‌డానికి ఓకె చెప్పింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు...అందాల చంద‌మామ కాజ‌ల్. ఓ వైపు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా చేస్తూ...మ‌రో వైపు సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో బ్ర‌హ్మాత్స‌వం సినిమా చేస్తూ...కాజ‌ల్ ఫుల్ బిజీగా ఉంది. అయితే కాజ‌ల్ పాట పాడుతుంది త‌ను న‌టిస్తున్న సినిమాలో కాదు. క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ న‌టిస్తున్న చ‌క్ర‌వ్యూహ సినిమాలో. ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ పాట పాడారు. ఇప్పుడు ఇదే సినిమాలో మ‌రో పాట‌ను కాజ‌ల్ పాడుతుండ‌డం విశేషం. ఈ చిత్రాన్ని జ‌ర్నీ ఫేం శ‌ర‌వ‌ణ‌న్ తెర‌కెక్కిస్తున్నారు. మ‌రి...కాజ‌ల్ పాడిన పాట ఎలా ఉంటుందో వినాలి.

More News

రకుల్ క్షమించమంటుంది...

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది. గతేడాది చరణ్ సరసన బ్రూస్ లీ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ ఈ ఏడాది సంక్రాంతికి ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, సమ్మర్ లో బన్నితోసరైనోడు అంటూ సందడి చేయబోతుంది.

రాజ‌మౌళి కూడా ఫాలో అవుతున్నాడు..

ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి కూడా ఫాలో అవుతున్నాడు... ఇంత‌కీ ఏం ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారా..? ట‌్రెండ్ ఫాలో అవుతున్నాడు.

ఆ..సినిమా రిజ‌ల్ట్ కోసం వెయిట్ చేస్తున్నచ‌ర‌ణ్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..బ్రూస్ లీ త‌ర్వాత త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

డిక్టేట‌ర్ సెన్సార్ రిపోర్ట్..

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య హీరోగా శ్రీవాస్ తెర‌కెక్కించిన చిత్రం డిక్టేట‌ర్. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన డిక్టేట‌ర్ సంక్రాంతి కానుక‌గా ఈనెల 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

'చిత్రం భళారే విచిత్రం' మూవీ రివ్యూ

ప్రస్తుతం హర్రర్ కామెడి చిత్రాలకు మంచి ట్రెండ్ కొనసాగుతుంది. ఆ ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చిన సినిమాలు మంచి ఆదరణ కూడా పొందాయి. దాంతో ప్రయోగం దర్శకుడు భాను ప్రకాస్ బలుసు చేసిన హర్రర్ కామెడి చిత్రమే చిత్రం భళారే విచిత్రం.