బెల్లంకొండ శ్రీనివాస్ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న కాజల్ అగర్వాల్

  • IndiaGlitz, [Friday,June 01 2018]

యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు.

ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ 9 కోట్ల 50 లక్షలకు అమ్ముడు అయ్యాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడుతోన్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితీష్ ముఖేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ మధ్య కొన్ని కీలక సీన్స్ చిత్రీకరుస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. చోటా కె నాయడు సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు.

హర్షవర్ధన్ రాణే ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్, కళ్యాణి నటరాజన్, అపూర్వ ఈ మొవీలో మరో ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చాగంటి శాంతయ్య కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రంగస్థలం సినిమా తరువాత చంద్రబోస్ ఈ సినిమాకు సింగిల్ కార్డు రచయితగా పని చెయ్యడం విశేషం.

More News

ఐపిసి సెక్షన్.. భార్యాబంధు పాటల విడుదల

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు".

మ‌హేష్ 25 కాన్సెప్ట్ అదేనా?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, ఉత్త‌రాది భామ‌ పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "మహేష్‌ 25వ సినిమా" తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

అఖిల్, వర్మ సినిమాపై స్పందించిన నాగార్జున‌

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌కు ‘అఖిల్’, ‘హలో’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి.

బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన తరుణ్

నిన్నటి వరకూ తను బిగ్ బాస్ లో కంటెస్టెంట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల పై హీరో తరుణ్ స్పందించారు. తను బిగ్ బోస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

1994 నేప‌థ్యంలో సాగే క‌థ‌తో..

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.