close
Choose your channels

వివాదాల్లో 'సీత‌'

Wednesday, May 22, 2019 • తెలుగు Comments

వివాదాల్లో సీత‌

ఈ మ‌ధ్య సినిమాలు విడుద‌ల‌వుతున్నాయంటే వివాదాలు కామ‌న్‌గా మారిపోయాయి. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో రూపొందిన 'సీత‌' కూడా  వివాదాల్లో చిక్కుకొంది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో అనీల్ సుంక‌ర నిర్మించిన 'సీత‌' ఈ నెల 24న విడుద‌ల కానుంది. అయితే పురాణానికి చెందిన పేరు పెట్టారు.

అయితే ఇందులో కొన్ని స‌న్నివేశాలు, డైలాగ్స్ అభ్యంత‌ర కరంగా ఉన్నాయంటూ బిజెవైఎమ్ అనే సంస్థ ఆరోప‌ణ‌లు చేస్తుంది. అంతే కాకుండా  సినిమాను ఆపాలంటూ స‌ద‌రు సంస్థ కోరుతుంది. సినిమా విడుద‌ల‌ను ఆప‌డానికి న్యాయస్థానానికి కూడా వెల్లాల‌ని బిజెవైఎం సంస్థ కోరుతుంది.

మ‌రిప్పుడు చిత్ర యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే  సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న త‌ర్వాత ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావ‌డం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇబ్బందిగా మారుతుంది. 

Get Breaking News Alerts From IndiaGlitz