'ఒక్కడొచ్చాడు' టీజర్ విడుదల చేస్తున్న కాజల్....

  • IndiaGlitz, [Thursday,October 20 2016]

పందెంకోడి, పొగరు, భరణి, పూజ, రాయుడు వంటి హిట్‌ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా 'ఒక్కడొచ్చాడు'. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో వుండే ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌ అన్నీ వుంటూనే ఒక పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ ఫిలింగా 'ఒక్కడొచ్చాడు' రూపొందుతోంది.

తమిళంలో కత్తిసండై పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాను సినిమాను న‌వంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. విశాల్ స‌ర‌స‌న మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్రతి ఊళ్ళోనూ జరిగే అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి. అలా న‌డుం క‌ట్టిన హీరోగా విశాల్ ఒక్క‌డొచ్చాడు చిత్రంలో సంద‌డి చేస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను అక్టోబ‌ర్ 21న కాజ‌ల్ అగ‌ర్వాల్ విడుద‌ల చేయ‌నుంది.