మహేష్ నెక్ట్స్ మూవీలో పాట పాడనున్న హీరోయిన్..

  • IndiaGlitz, [Saturday,May 14 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో నిర్మించింది. ఈ నెల 20న బ్ర‌హ్మోత్స‌వం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. బ్ర‌హ్మోత్స‌వం ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇటీవ‌ల మ‌హేష్, కాజ‌ల్ ఓ ఛానల్ కి ఇంట‌ర్ వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్ వ్యూలో..యాంక‌ర్ మాట్లాడుతూ...మాట్లాడుతూ ఓ పాట పాడేసింది. కాజ‌ల్ తో మీరు కూడా పాడండి అన్న‌ది. నేనా..పాట పాడ‌డ‌మా అంది కాజ‌ల్. మ‌హేష్ మామూలోడు కాదు క‌దా...ఈమ‌ధ్య కాజ‌ల్ పాట పాడింది అంటూ ఎవ‌రో లింక్ పంపించారు. తీరా చూస్తే...అది తెలుగు పాట కాదు...క‌న్న‌డ పాట పాడేసింది అంటూ త‌న‌దైన స్టైల్ లో స్పందించాడు. యాంక‌ర్ ఇక్క‌డితో ఈ టాపిక్ ఆప‌కుండా... మ‌హేష్ నెక్ట్స్ మూవీలో మీరు ఓ సాంగ్ పాడాలి అని కాజ‌ల్ తో అంది. ఇంకేముంది ఓకే పాడ‌తాను అన్న‌ది కాజ‌ల్. ఆవిధంగా మ‌హేష్ నెక్ట్స్ మూవీలో పాట పాడ‌తాను అని చెప్పింది క‌థానాయిక కాజ‌ల్.

More News

'జెంటిల్ మన్' టీజర్ కి మంచి స్పందన

నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'జెంటిల్ మన్' .మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.

చిరు మూవీ కోసం దేవిశ్రీ సిట్టింగ్స్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ చిత్రానికి వినాయక్ దర్శకుడు.

చంద్రముఖి -2 లో అనుష్క..

రజనీకాంత్,ప్రభు,జ్యోతిక,నయనతార కాంబినేషన్లో రూపొందిన చంద్రముఖి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

ఇక రామ్ చరణ్ కి ఏం జరుగుతుందో?

చిన్న సినిమాలతో తొలి అడుగులు వేసి..వరుస విజయాలతో తక్కువ కాలంలోనే పెద్ద హీరోయిన్ గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్.

తాప్పీ ఆ పని స్టార్ట్ చేసేసింది...

అందాల నాయిక తాప్సీ టాలీవుడ్ లోనే కాదు,బాలీవుడ్ లోనూ బిజీగా ఉంది.