అక్టోబ‌ర్ 27న 'కాళ‌రాత్రి' షూటింగ్ ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,October 14 2017]

వి.జె.వై.ఎస్‌.ఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై పి.ఆర్‌.బాబు దర్శకత్వంలో కామెడీ, సెంటిమెంట్‌, హార్రర్‌ ప్రధానాంశాలుగా రూపొందనున్న 'కాళరాత్రి' చిత్రం షూటింగ్‌ అక్టోబర్‌ 27న గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానున్నది. సంగీత దర్శకుడు సత్య కాశ్యప్‌ (ఐస్‌క్రీమ్‌ ఫేమ్‌) సంగీతం సమకూర్చగా గీతా మాధురి, అక్షయ్‌, స్వరరాజ్‌ గానం చేయగా, నాలుగు పాటలు ఇటీవల రికార్డింగ్‌ చేశారు.

ఈ చిత్రంలో హీరోగా నూతన నటుడ్ని పరిచయం చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. శాలినిసింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇతర పాత్రల్లో జీవా, రాంజగన్‌, జాకీ, దువ్వాసి మోహన్‌, రాళ్లపల్లి, తిరుపతి ప్రకాష్‌, చిట్టిబాబు తదితరులు నటించే ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్‌ నటి ఒక ప్రధాన పాత్రలో నటించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సత్యకాశ్యప్‌, కెమెరా: వెంకట్‌, ఎడిటింగ్‌: భద్రం, పాటలు: శివశంకర్‌, డ్యాన్స్‌: సామ్రాట్‌, ప్రొడక్షన్‌ మేనేజర్స్‌: వినయ్‌, చంద్రశేఖర్‌, సహ నిర్మాతలు: తనూజ, జి.శ్రీనివాస్‌, వై.శేషిరెడ్డి, కోడైరెక్టర్‌: ప్రవీణ్‌కుమార్‌, నిర్మాణం: విజెవైఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.ఆర్‌.బాబు.

More News

'సువర్ణ సుందరి'గా మారిన జయప్రద

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడంతా హిస్టారికల్ మూవీస్ హవా నడుస్తోంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా భారీ నిర్మాణ సంస్థ లన్నీ చారిత్రాత్మక చిత్రాల నిర్మాణంపై దృష్టి పెడుతూ.. అంతే భారీ విజయాలను అందుకుంటున్నాయి.

'రాజరథం' లో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఆర్య

'రంగితరంగ' చిత్రం చూసి ఇన్స్పైర్ అయి 'రాజరథం' చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన ఆర్య తన మొదటి సినిమాతోనే ఆస్కార్ అవార్డ్ నామినేషన్ వరకు వెళ్ళిన దర్శకుడు అనూప్ భండారి ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు.

27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'అనగనగా ఒక దుర్గ'

గడ్డంపల్లి రవీందర్ రెడ్డి (యుఎస్) సమర్పణలో ఎస్ ఎస్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం అనగనగా ఒక దుర్గ. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనెల 27న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్.

నయనతారకి అలా మరోసారి..

తమిళంలో లేడీ సూపర్స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతార.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో బాలకృష్ణ 102వ చిత్రంలోనూ నయన్ నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అనుపమకి అది రిపీట్ అవుతుందా?

అఆ, ప్రేమమ్, శతమానం భవతి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ కేరళకుట్టి.. రామ్ తో ఉన్నది ఒకటే జిందగీ, నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలు చేస్తోంది.