close
Choose your channels

హరీష్ లేకుండానే కాళేశ్వరం ఓపెనింగా.. ఇదేంటి బాస్..!?

Friday, June 21, 2019 • తెలుగు Comments

హరీష్ లేకుండానే కాళేశ్వరం ఓపెనింగా.. ఇదేంటి బాస్..!?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ఘట్టం శుక్రవారం ఉదయం ఆవిష్కృతమైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేష‌న్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 11:23 గంటలకు ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అయితే ఈ మహోత్తర కార్యక్రమానికి మాజీ మంత్రి.. అహర్నిశలు కష్టపడి పనిచేసి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన హరీష్ లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. ఆయనకు ఆహ్వానం అందిందా..? లేదా అన్నది కూడా తెలియరాలేదు. ఈ మహోన్నత కార్యక్రమం ఓ వైపు జరుగుతుంటే.. అయితే హరీష్ సిద్ధిపేటకే పరిమితమయ్యారు.

జగన్, ఫడ్నవిస్ రాక..

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు తెలుగురాష్ట్రాల మంత్రులు, ప్రాజెక్టు ఇంజినీర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా ప్రారంభోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉం

శిలాఫలకం ప్రారంభించిన జగన్...

కార్యక్రమంలో భాగంగా మొదట ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని స్విచ్‌ ఆన్ చేసి ఆవిష్కరించారు. సరిగ్గా 11:23 నిమిషాలకు ఈ శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జగన్‌తో పాటు కేసీఆర్ కూడా ఇద్దరూ కలిసి స్విచాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇద్దరూ ఉన్నప్పటికీ వైఎస్ జగన్‌కు ఈ అవకాశం కల్పించడం విశేషమే.

కొబ్బరికాయలు కొట్టిన ప్రముఖులు

కాగా.. శిలాపలకం ప్రారంభం అనంతరం ప్రాజెక్ట్ దగ్గర మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్ నరసింహన్, అతిథులు కొబ్బరికాయలు కొట్టగా.. చివరన కేసీఆర్ గుమ్మడికాయ కొట్టి రిబ్బన్ కట్ చేశారు. అంతకుముందు ఉదయం 10గంటలకు మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో వేదోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య‌ జలసంకల్ప మహోత్సవ యాగం నిర్వహించారు. ఈ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించిన వేదపండితులు.. అనంతరం పూజలు ప్రారంభించారు. వరుణ దేవుణ్ణి ఆహ్వానిస్తూ మహాసంకల్ప యాగం నిర్వహించారు. ఈ యాగంలో గవర్నర్ నరసింహన్, సీఎంలు వైఎస్ జగన్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబరాలకే పరిమితమైన హరీష్...

ఇదిలా ఉంటే.. ఓ వైపు కాళేశ్వర ప్రాజెక్ట్ ప్రారంభ మహోత్సవం జరుగుతుండగా.. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు గుళ్లల్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి.. బాణసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. అయితే హరీష్ కూడా సాధారణ కార్యకర్తలాగే సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రంగనాయకసాగర్ రిజర్వాయర్ సమీపంలోని రంగనాయకుల గుట్టపై జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాల్లో పాల్గొన్నారు.

అయితే.. హరీష్ లేకుండా కాళేశ్వరం ఓపెనింగ్ చేయడాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. కనీసం హరీష్‌ను కొబ్బరికాయ కూడా కొట్టనివ్వకపోవడం సిగ్గుచేటని మరోవైపు రాజకీయ విశ్లేషకులు, ప్రముఖులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై హరీష్, కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz