'కల్పన-3' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Tuesday,May 09 2017]

సాయివెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో భీమ‌వ‌రం టాకీస్ బ్యాన‌ర్‌పై ఉపేంద్ర‌, ప్రియ‌మ‌ణి, తుల‌సి తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం 'క‌ల్ప‌న‌-3'. ఉద‌య్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేస్తున్నారు. అర్జున్ జ‌న్య సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొనెజోటి రోశ‌య్య ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆడియో సీడీల‌ను కొనెజేటి రోశయ్య విడుద‌ల చేశారు.
చిత్ర స‌మ‌ర్ప‌కుడు సాయివెంక‌ట్ మాట్లాడుతూ - ''క‌ల్ప‌న‌-3 సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యింది. సినిమా చాలా ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంది. మా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పిశాచి2 ఈ మ‌ధ్య కాలంలో పెద్ద స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. పిశాచి 2 100 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేశామంటే అందుకు కార‌ణం రామ‌స‌త్య‌నారాయ‌ణ‌గారే. ఈ సినిమా కూడా మా కాంబినేష‌న్‌లో పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను'' అన్నారు.
తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ''ప‌ది మంది స‌పోర్ట్ ఉంటే ఎవ‌రైనా పైకి వ‌స్తార‌నే దానికి నేనే ఉదాహ‌ర‌ణ‌. నేను తీసిన దెయ్యం సినిమాల‌న్నీ మంచి విజయాల‌నే సాధించాయి. ఈ చిత్రాన్ని త‌మిళంలో రాఘ‌వ లారెన్స్ చేశాడు. క‌న్న‌డంలో ఉపేంద్ర చేశాడు. క‌న్న‌డంలో కోట్లు వ‌సూలు చేసిన ఈ సినిమాను తెలుగులో మే 19న‌ విడుద‌ల చేస్తున్నాను'' అన్నారు.
కె.రోశయ్య మాట్లాడుతూ - '' నేను స‌గ‌టు ప్రేక్ష‌కుడిని సినిమాలోని లోటు పాట్లు గురించి నాకు పెద్ద‌గా తెలియ‌వు. రామ‌స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని భావిస్తున్నాను. త‌మ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.
సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ - ''రామ‌స‌త్య‌నారాయ‌ణ వంద సినిమాల‌కు నిర్మాత‌గా మార‌నున్నాడు. త‌న‌ను నేనే కంట్రోల్ చేశాను. లేకుంటే ఇప్ప‌టికే రెండు వంద‌ల సినిమాల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేసేవాడేమో. నేను ఇంకా 66 సినిమాలే చేస్తున్నాను. నేను కూడా హ‌ర్ర‌ర్ సినిమాల‌తో మంచి విజ‌యాల‌ను సాధించాను. రామ‌స‌త్య‌నారాయ‌ణ కూడా ఈ సినిమాతో మంచి హిట్ కొడ‌తాడు'' అన్నారు.
మల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - ''రామ‌స‌త్యనారాయ‌ణ భీమ‌వ‌రం టాకీస్ ఓ ఫ్యాక్టరీలా ప‌నిచేస్తుంది. ఈ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకుంటాడు'' అన్నాడు.
ఈ కార్య‌క్ర‌మంలో కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌, శివ‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

'అంధగాడు' పాటల సందడి షురూ...

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ లో

స్కాం సొమ్ముతోనే సినిమా

గతంలో కృత్తిమ గర్భధారణం అనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా 'అమ్మా నీకు వందనం'.

కిడ్నాప్ చేయలేందటున్న బుల్లితెర నటుడు...

బుల్లితెర నెంబర్ వన్ షోగా సాగుతున్న జబర్ దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది కమెడియన్స్ పరిచయమవుతున్నారు.

పీటర్ హెయిన్స్ దర్శకత్వం...

సౌతిండియా స్టార్ యాక్షన్ కంపోజర్ పీటర్ హెయిన్స్ త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నారు.

బ్రూస్ లీ జీవిత కథ తో సినిమా..

ఎలిజిబెత్,ది గోల్డెన్ ఏజ్ సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న