మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'

  • IndiaGlitz, [Wednesday,May 10 2017]

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌'. కళ్యాణ్‌, లక్ష్మీశిల్ప హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో మెగా బ్రదర్‌ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అనంతరం నటి కవిత తొలి సన్నివేశానికి క్లాప్‌ నివ్వగా నిర్మాత సాయివెంకట్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ప్రముఖ దర్శకులు సాగర్‌ ఈ చిత్రం తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం చిత్ర నిర్మాత టి. రామకృష్ణ మాట్లాడుతూ.. చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన అతిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జూన్‌ మొదటివారం నుండి చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతోంది. విశాఖపట్నం, అరకు, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో మొదటి షెడ్యుల్‌ షూటింగ్‌ని ప్లాన్‌ చేశాము...అని తెలిపారు.
కళ్యాణ్‌, లక్ష్మీశిల్ప, పోసాని కృష్ణమురళీ, సాయికుమార్‌, కవిత, విజయ్‌, వెంకటేష్‌ మరియు నూతన నటీనటులు నటించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌: జయసూర్య, ఎడిటింగ్‌: నందమూరి హరి, కెమెరా: మహిషర్ల, నిర్మాత: టి. రామకృష్ణ, దర్శకత్వం: సత్య.

More News

కాజల్ తొలిసారిగా అది చేస్తుంది...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో కాజల్ ఒకరు.మూడు పదులు వయసు దాటిన ఈ అమ్మడుకి తెలుగులో

పవన్ తో విభేదించిన కలెక్షన్ కింగ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టిటిడి దేవాలయ ఈవోగా ఐఎఎస్ సింఘాల్ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరాదికి చెందిన ఐఎఎస్ను టిటిడి ఈవోగా నియమించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.

'వైశాఖం' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

'ప్రేమలో పావని కళ్యాణ్', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్లీ' వంటి సూపర్హిట్ చిత్రాల తర్వాత డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ. రాజు నిర్మిస్తున్న లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'వైశాఖం'. ఆర్.జె. సినిమాస్ పతాకంపై హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో విడుదల చేశా

5 లక్షల విలువైన హెల్త్ కార్డు లను అందజేసిన ప్రతాని

చిన్న చిత్రాల నిర్మాతలకు అండగా నిలిచి , కార్మికుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ధీరోదాత్తుడు ప్రతాని రామకృష్ణా గౌడ్ తాజాగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ లో ఉన్న సాంకేతిక నిపుణులకు , నటీనటులకు ప్రభుత్వ సహాయంతో 5 లక్షల విలువైన హెల్త్ కార్డు ని అందించాడు . ఈ హెల్త్ కార్డు వల్ల ఆరోగ్య భద్రత మాత్రమే కాకుండా ఇ&

బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ప్రతిష్ఠాత్మక భారీ చిత్రం

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో