క‌ళ్యాణ్ రామ్ 'అమిగోస్' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Monday,November 07 2022]

టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. రీసెంట్‌గా ‘బింబిసార’ చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించారు. ఈ భారీ విజ‌యం త‌ర్వాత నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేందర్ రెడ్డితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న NKR 19 చిత్రానికి మేక‌ర్స్ సోమ‌వారం రోజున ‘అమిగోస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విభిన్నమైన పాత్ర‌లు, సినిమాలు చేసే హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న ఈ సినిమా టైటిల్ కూడా డిఫ‌రెంట్‌గా ఉండ‌టంతో అంద‌రిలో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.

‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. అమిగోస్ అనేది స్పానిష్ ప‌దం. ఓ స్నేహితుడిని సూచించ‌డానికి లేదా రెఫ‌ర్ చేయ‌డానికి ఈ ప‌దాన్ని ఉప‌యోగిస్తుంటారు. ఈ టైటిల్ అనౌన్స్ చేయ‌టంతో పాటు స్టైలిష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ సినిమా కాన్సెప్ట్ ఏంట‌నే విష‌యాన్ని సూచిస్తుంది. క‌ళ్యాణ్ రామ్ పాత్ర మూడు షేడ్స్‌లో ఉంటుంద‌నే విష‌యాన్ని ఈ పోస్ట‌ర్ ఎలివేట్ చేస్తుంది.

‘దె సే వెన్‌ యు మీట్‌ సమ్‌బడీ దట్‌ లుక్స్ జస్ట్ లైక్‌ యు, యు డై’ ( నీలాగే కనపడే ఇంకో వ్యక్తి నీకు ఎదురుపడితే నువ్వు చస్తావు అని చెప్తారు)అనేది పోస్ట‌ర్‌పై క్యాప్ష‌న్‌గా క‌నిపిస్తుంది. ఈ పోస్ట‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మేక‌ర్స్ మ‌రింత‌గా పెంచేశారు. ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 10, 2023న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేయ‌టంతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

ఎన్నో సెన్సేష‌న‌ల్ మూవీస్‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస‌తోన్న ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగ‌నాథ్ న‌టిస్తుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా.. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వర్క్ చేస్తున్నారు.

More News

Vishwak Sen- Arjun Sarja: ఇష్టంలేని కాపురం చేయలేం ..నా తప్పుంటే క్షమించండి సర్: విశ్వక్‌సేన్

సీనియర్ నటుడు అర్జున్ సర్జా, యువ హీరో విశ్వక్ సేన్ మధ్య చోటు చేసుకున్న వివాదం టాలీవుడ్‌లో పెను దుమారానికి కారణమైంది. అతను కమిట్‌మెంట్ లేని నటుడని...

గీతూ ఎలిమినేషన్.. హౌస్‌లో ఉద్విగ్న వాతావరణం, నాగార్జున సైతం కంటతడి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ప్రేక్షకులను , కంటెస్టెంట్స్‌ను చివరికి హోస్ట్‌ నాగార్జునను కూడా కంటతడి పెట్టించింది ఈ రోజు ఎపిసోడ్. స్ట్రాటజీ అనుకోండి, కన్నింగ్‌నెస్ అనుకోండి

Munugode Bypoll : హోరాహోరీ పోరులో టీఆర్ఎస్‌దే విజయం, బీజేపీకి సెకండ్ ప్లేస్, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు

తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి

Alia Bhatt Ranbir Kapoor: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా... కపూర్ ఇంట సంబరాలు

బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట తల్లిదండ్రులయ్యారు. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు

నేరం గీతూది.. శిక్ష శ్రీహాన్‌కి, వీడియోలు చూపించి ఆడుకున్న నాగ్

మిషన్ పాజిబుల్ టాస్క్ ముగిసి శ్రీసత్య ఇంటికి కొత్త కెప్టెన్‌గా అవతరించింది. ఇక అంతా ఆమెకు సాయం చేసి తనను కెప్టెన్‌ కాకుండా అడ్డుకున్నారంటూ ఇనయా కుళ్లి కుళ్లి ఏడ్చింది.