మార్చ్ 1 న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ '118'

  • IndiaGlitz, [Friday,January 11 2019]

డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స్టైలిష్ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ '118'. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టించారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చ్ 1 న విడుదల చేస్తున్నట్లు నిర్మాత మహేష్ కోనేరు తెలిపారు.

నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ - ''నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌గారి 118 టైటిల్ లోగో, ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌ను ఇప్పటికే విడుద‌ల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది . చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. క‌ల్యాణ్ రామ్‌గారి పాత్ర లుక్ ఎలా ఉంటుంద‌నే విష‌యంతో పాటు అస‌లు సినిమా ఏ జోన‌ర్‌లో తెర‌కెక్కింద‌నే విష‌యాన్ని టీజ‌ర్ ద్వారా చూపించాం. సీట్ ఎడ్జింట్ థ్రిల్ల‌ర్ ఇది.

క‌ల్యాణ్ రామ్‌గారు ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి జోన‌ర్. వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీష్ అద్భుతమైన యాక్ష‌న్ పార్ట్ సినిమాలో చాలా కీల‌కంగా ఉంటుంది. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసిన ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కులు కె.వి.గుహ‌న్‌గారు ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచయం అవుతున్నారు. ద‌ర్శ‌క‌త్వంతో పాటు ఆయ‌న క‌థ‌, క‌థ‌నం, సినిమాటోగ్ర‌ఫీ చేశారు. శేఖర్ చంద్ర సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు'' అన్నారు.

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, నివేదా థామ‌స్‌, షాలిని పాండే త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లు: మిర్చి కిర‌ణ్‌, పి.ఆర్ అండ్ మార్కెటింగ్‌: వ‌ంశీ కాక‌, ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్‌.ఎం, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఫైట్స్‌: వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీశ్‌, వి.ఎఫ్.ఎక్స్‌: అద్వైత క్రియేటివ్ వ‌ర్క్స్‌, అనిల్ ప‌డూరి, నిర్మాత‌: మ‌హేశ్ కొనేరు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్ర‌ఫీ, ద‌ర్శ‌క‌త్వం: కె.వి.గుహ‌న్‌.

More News

విశాల్ పెళ్లి వెన్యూ ఫిక్స్!

తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోగా మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న విశాల్ ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నాడు. సాధారణంగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటూ వుంటారు.

16 ఏళ్ల తర్వాత...

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, సౌందర్య, జగపతిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'అంతఃపురం'. ఈ చిత్రాన్ని నానా పటేకర్ ప్రధాన పాత్రధారిగా హిందీలో కూడా కృష్ణవంశీ రీమేక్ చేశారు.

గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ 'ఉండిపోరాదే..'

త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతూ శ్రీమ‌తి స‌త్య ప్ర‌మీల క‌ర్ల‌పూడి స‌మ‌ర్ప‌ణ లో

ఫార్ములా సినిమానే కావాలి...

గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో 'గౌతమ్‌నంద' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు.

ఓ లైఫ్ చూసినట్టుగా అనిపించింది - కృష్ణ

ఎన్టీఆర్ జీవితాన్ని 'యన్.టి.ఆర్' అనే బయోపిక్‌గా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో తొలి భాగం 'యన్.టి.ఆర్ కథానాయుకుడు' జనవరి 9న విడుద‌లైంది.