close
Choose your channels

స్పీడు పెంచిన కల్యాణ్‌రామ్‌

Saturday, December 8, 2018 • తెలుగు Comments

స్పీడు పెంచిన కల్యాణ్‌రామ్‌

క‌ల్యాణ్‌రామ్ ఇప్పుడు స్పీడు పెంచారు. ఆయన వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండ‌గానే మ‌రో సినిమా గురించి ఆలోచిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ప‌నుల‌మీదే ఆయ‌న ముంబైకి వెళ్లారు. 118 అని ఆ సినిమాకు టైటిల్ కూడా ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే ఆయ‌న మ‌రో సినిమాకు అంగీకారం తెలిపిన‌ట్టు స‌మాచారం. ఆ సినిమాకు విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం చేస్తారు. ఉయ్యాల జంపాల చిత్రంతో త‌న కెరీర్‌ను మొద‌లుపెట్టిన విరించి వ‌ర్మ ఆ త‌ర్వాత మ‌జ్ను చేశారు. ఇటీవ‌లే క‌ల్యాణ్‌రామ్‌ను క‌లిసి లైన్ చెప్పార‌ని స‌మాచారం. విరించి చెప్పిన లైన్ న‌చ్చిన క‌ల్యాణ్‌రామ్ పూర్తి క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పార‌ట‌.

సో విరించి ఆ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. హారిని అండ్ హాసిని క్రియేష‌న్స్ తెర‌కెక్కించ‌నున్నారు. మ‌రోవైపు య‌న్.టి.ఆర్ బ‌యోపిక్‌లో త‌న తండ్రి పాత్ర‌ను క‌ల్యాణ్‌రామ్ పోషించిన సంగ‌తి తెలిసిందే. 

Get Breaking News Alerts From IndiaGlitz