క్రేజీ టైటిల్‌.. స్టార్ ప్రొడ్యూస‌ర్‌తో క‌ల్యాణ్‌రామ్‌..!

  • IndiaGlitz, [Monday,December 28 2020]

ఒక‌వైపు హీరోగా, మ‌రోవైపు నిర్మాత‌గా సినిమా రంగంలో బిజీగా ఉంటున్న వ్య‌క్తి నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌. ఈ నంద‌మూరి హీరోకి క‌థ‌నాయ‌కుడిగా 118 త‌ర్వాత ఆశించిన రేంజ్‌లో స‌క్సెస్ లేదు. ఈ ఏడాది ఎంత మంచివాడ‌వురా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా స‌క్సెస్‌ను సొంతం చేసుకోలేక‌పోయాడీ హీరో. ఇప్పుడు వ‌శిష్ట అనే కొత్త డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తున్నాడు. అలాగే మ‌ల్లిడి వేణు ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా కూడా ఉంది. ఇవి రెండు కాకుండా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మాణంలో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాకు ‘డూ ఆర్ డై’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

హీరోగా వరుస సినిమాలకు ఓకే చెబుతున్న కల్యాణ్ రామ్ మ‌రోవైపు నిర్మాత‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. జై ల‌వ‌కుశ త‌ర్వాత ఎన్టీఆర్‌తో క‌ల్యాణ్‌రామ్ చేస్తున్న రెండో చిత్ర‌మిది. దీనికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ రాధాకృష్ణ మ‌రో నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

More News

రిలయన్స్‌ జియోపై యుద్ధం ప్రకటించిన రైతులు..

గత కొన్ని రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రంపై యుద్ధానికి దిగిన రైతులు తాజాగా రిలయన్స్ కంపెనీపై తమ యుద్ధాన్ని ప్రకటించారు.

గుణ‌శేఖర్ శ‌కుంత‌ల‌గా ఈ స్టార్ హీరోయిన్ క‌నిపించ‌నుందా..?

బ‌డ్జెట్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకుండా భారీ సెట్స్ వేసి చిత్రీక‌రించే ద‌ర్శ‌కుల్లో గుణ‌శేఖ‌ర్ ఒక‌డు. ఈయ‌న పేరు వింటే.. త‌ను చేయ‌బోయే సినిమా కోసం ఎలాంటి సెట్స్ వేస్తాడోన‌ని ప్రేక్ష‌కుడు ఆలోచిస్తాడు.

2021లో ధరల మోత మోగించనున్న గృహోపకరణాలు

2021లో కరోనా మహమ్మారి మాటేమో కానీ.. ధరల పెరుగుదల మాత్రం ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తోంది. ఎల్‌ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు వంటి కీలకమైన గృహోపకరణాల ధరలు జనవరి నుంచి 10 శాతం మేరకు పెరిగే

బాలీవుడ్‌లో ర‌ష్మిక స్పీడు..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌లో ఒక‌రైన ర‌ష్మిక మంద‌న్న‌.. ఇప్పుడు త‌మిళంతో పాటు బాలీవుడ్‌లోనూ స్పీడు పెంచుతోంది.

‘మ‌హా స‌ముద్రం’ టైటిల్ వెనుక క‌థ ఇదేనా?

డైరెక్ట‌ర్‌గా తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి.