కళ్యాణ్ రామ్ షేర్ ఆడియో రిలీజ్ విశేషాలు..

  • IndiaGlitz, [Monday,October 12 2015]

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన చిత్రం షేర్. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న సోనాల్ చౌహ‌న్ న‌టించారు. ఈ చిత్రాన్ని విజ‌య‌ల‌క్ష్మి పిక్చ‌ర్స్ ప‌తాకం పై కొమ‌ర వెంక‌టేష్ నిర్మించారు. త‌మ‌న్ సంగీతాన్ని అందించిన‌ షేర్ ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం పార్క్ హ‌య‌త్ హోట‌ల్లో జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌రై బిగ్ సి.డి.ని ఆవిష్క‌రించ‌గా..నంద‌మూరి రామ‌క్రిష్ణ ఆడియో సి.డి.ల‌ను విడుద‌ల చేసి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు అంద‌చేసారు.

హీరో క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ...డైరెక్ట‌ర్ మ‌ల్లిఖార్జున్ తో నాకిది మూడో చిత్రం. మ‌ల్లిఖార్జున్ తో సినిమా చేస్తున్నాన‌ని ఎనౌన్స్ చేయ‌గానే మ‌ల్లితో సినిమా ఎందుకు చేస్తున్నావ్ అన‌డిగారు. నేను క‌థ‌ను న‌మ్మి సినిమాలు చేస్తాను. ఈ సినిమాతో మ‌ల్లిఖార్జున్ కి స‌క్సెస్ రావాలని కోరుకుంటున్నాను. నంద‌మూరి ఫ్యామిలీ అంతా ఒక్క‌టే. మ‌మ్మ‌ల్ని వేరు చేసి మాట్లాడ‌ద్దు. మా ఫ్యామిలీ నుంచి మోక్ష‌జ్న కూడా వ‌స్తున్నాడు. మేమేప్పుడు క‌లిసే ఉంటాం అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ...అన్న‌య్య‌తో మ‌ల్లిఖార్జున్ తీసిన షేర్ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. త‌మ‌న్ ఏ సినిమాకైనా మంచి సంగీతాన్ని అందిస్తాడు. ఈ సినిమాకి కూడా మంచి సంగీతాన్ని అందించాడు. నాన్న‌కు ప్రేమ‌తో..సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో హైద‌రాబాద్ వ‌స్తే...కిక్ 2 సినిమా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే సంత‌కాలు పెట్ట‌డానికి వ‌చ్చాన‌ని వార్త‌లు వ‌చ్చాయి.అందులో ఏమాత్రం వాస్త‌వం కాదు. చ‌నిపోయే వ‌ర‌కు క‌ళ్యాణ్ అన్న‌య్య చెయ్యి పైనే ఉంటుంది అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ సోనాల్ చౌహ‌న్, డైరెక్ట‌ర్ మ‌ల్లిఖార్జున్, నిర్మాత దిల్ రాజు, ర‌చ‌యిత వక్కంతం వంశీ, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

ఊటీలో 'బ్రహ్మోత్సవం'?

'శ్రీమంతుడు'.. మహేష్ బాబు కి కొత్త ఉత్సాహాన్నిచ్చిన చిత్రమిది. 80 కోట్లకి పైగా షేర్ పొందిన ఈ సినిమా విజయంతో.. మహేష్ తన కొత్త చిత్రం 'బ్రహ్మోత్సవం'ని మరింత జనరంజకంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

'సర్దార్' దీ 'గబ్బర్ సింగ్' రూటేనా?

'గబ్బర్సింగ్'.. పవన్ కళ్యాణ్ కిబ్లాస్ బస్టర్ హిట్ ని చాన్నాళ్ల తరువాత అందించిన సినిమా ఇది. 2012 సమ్మర్ లో విడుదలై.. సంచలన విజయం సాధించింది ఈ మూవీ. పవన్ వన్ మేన్ షోగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం అంటే అభిమానులకు ఎంతో స్పెషల్.

'బ్రూస్ లీ'లోనూ ఆ సీన్ ఉంటుందా?

శ్రీనువైట్ల సినిమాలంటే వినోదానికి పెట్టింది పేరు. అయితే 'ఆనందం' నుంచి వైట్ల సినిమాల్లో వినోదం కోసం ఏ సీన్లు రిపీట్ చేసినా.. చేయకపోయినా ఓ సీన్ మాత్రం కంపల్సరీ.

'పటాస్' డైరెక్టర్ ఫార్ములా మిస్ కావడం లేదు

2015లో తొలి ఘన విజయంగా 'పటాస్' మూవీ క్రెడిట్ దక్కించుకుంది. కళ్యాణ్ రామ్ కి రాంగ్ టైమ్ నడుస్తున్న టైంలో రైట్ రిజల్ట్ ఇచ్చిన ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చాడు.

నయనతార.. మూడోనెల

కోలీవుడ్లో నయన తార పేరు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అక్కడి సినిమాలతోనూ.. లేదంటే అక్కడి సెలబ్రిటీలతో లవ్ ఎఫైర్స్, ఫెయిల్యూర్స్.. ఇలా ఆమె ఏం చేసినా సెన్సేషన్. ఈ మధ్య మాత్రం మిగతా వ్యవహారాల కంటే సినిమాల పరంగానే నయన పేరు తరుచుగా అక్కడ నానుతోంది.