పోకిరి మహేష్ తరహాలో కల్యాణ్ రామ్....

  • IndiaGlitz, [Wednesday,October 05 2016]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అంటే హీరోల‌కు మాస్ ఇమేజ్‌ను తెచ్చి పెట్ట‌డంలో త‌నొకొక ప్రత్యేక‌మైన స్ట‌యిల్ ఉంది. అందుకే హీరోలంద‌రూ పూరి జ‌గ‌న్నాథ్ సినిమాలో న‌టించాల‌ని ఎదురుచూస్తుంటారు. ప్ర‌స్తుతం పూరి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇజం. ఈ చిత్రంలో క‌ల్యాణ్‌రామ్‌ను స‌రికొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు పూరి. ముఖ్యంగా క‌ల్యాణ్‌రామ్ సిక్స్‌ప్యాక్‌లో క‌న‌ప‌డున్నారు. అలాగే సినిమాలో క‌ల్యాణ్‌రామ్ ప‌వ‌ర్‌ఫుల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడ‌ని తెలిసిందే. అయితే పూరి మాత్రం త‌న సినిమాలో క‌ల్యాణ్‌రామ్‌ను వేరే డైమెన్ష‌న్‌లో చూపిస్తున్నాడట‌. హీరోను స్ట్రీట్ ఫైట‌ర్‌గా ముందు సినిమాలో చూపించాడ‌ట‌. చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి క‌ల్యాణ్‌రామ్ అండ‌ర్ క‌వ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేస్తుంటాడు. ఇంత‌కు అండ‌ర్ క‌వ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌గా క‌ల్యాణ్‌రామ్ ఎందుకు ప‌నిచేస్తుంటాడ‌నే విష‌యం సినిమా చూడాల్సిందేనంటున్నారు. క‌ల్యాణ్‌రామ్ పాత్ర డిజైనింగ్ పోకిరి సినిమాలో మ‌హేష్ త‌రహాలో ఉంటుంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే పోకిరిలో మ‌హేష్ అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ అయితే, ఇజంలో క‌ల్యాణ్‌రామ్ అండ‌ర్‌క‌వ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌గా క‌న‌ప‌డ‌తాడ‌ట‌.