'కళ్యాణ వైభోగమే' సెన్సార్ పూర్తి...

  • IndiaGlitz, [Saturday,January 16 2016]

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ 'అలా మొదలైంది' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మించిన చిత్రం "కళ్యాణ వైభోగమే". నందిని రెడ్డి తన మొదటి చిత్రం ' అలా మొదలైంది ' శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించింది .

ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం కళ్యాణ వైభోగమే'. నాగశౌర్య, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. సినిమా సెన్సార్ పూర్తి కావడంతో సినిమా జనవరి 22న విడుదల కావడం దాదాపు ఖాయమైనట్టే.

More News

కేరళకు బాహుబలి టీమ్..

దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల బాహుబలి 2 కోసం ప్రభాస్, రమ్యక్రిష్ణలపై రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

జనతా గ్యారేజ్ లేటెస్ట్ అప్ డేట్స్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో...సంక్రాంతి కానుకగా రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

మంచు విష్ణు, రాజ్ తరుణ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

నాని ఆడియోకి అతిథిగా మహేష్..

భలే భలే మగాడివోయ్ సినిమాతో సక్సెస్ సాధించిన యువ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం క్రిష్ణ గాడి వీర ప్రేమగాథ. ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.

'ఎక్స్ ప్రెస్ రాజా' మూవీ రివ్యూ

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు వంటి రెండు వరుస విజయాలు తర్వాత శర్వానంద్ నటించిన చిత్రమే ఎక్స్ ప్రెస్ రాజా. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన చిత్రం కూడా ఇదే.