మెహ‌రీన్ స్థానంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌?

  • IndiaGlitz, [Saturday,April 14 2018]

ఐరా క్రియేషన్స్ సంస్థను స్థాపించి.. ఆ సంస్థలో మొద‌టి చిత్రంగా ‘ఛలో’ సినిమాను నిర్మించారు యువ క‌థానాయ‌కుడు నాగశౌర్య. ఈ సినిమా తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోయింది. మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. ఈ సినిమాతో విజ‌యాన్ని అందుకుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు ఈ హీరో. ఇప్పుడు ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఈ యువ కథానాయకుడు. ఈ నేపథ్యంలో తన సంస్థలో నిర్మిస్తున్న ‘@నర్తనశాల’ సినిమాతో కొత్త దర్శకుడు శ్రీ‌నివాస్ చక్రవర్తిని పరిచయం చేస్తున్నారు.

తాజాగా రెగ్యుల‌ర్‌ షూటింగ్ కూడా మొద‌లైంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగశౌర్యకు జంటగా మెహరీన్ నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఆమె స్థానంలో ‘హలో’ భామ కళ్యాణి ప్రియదర్శిని నాయికగా నటించనుందని సమాచారం. ఈ చిత్రంలో తనకు జోడిగా కళ్యాణి అయితే బాగుంటుందని నాగశౌర్య భావించడంతో.. కథానాయిక విషయంలో మార్పు చోటుచేసుకుందని చిత్ర బృందం చెబుతోంది. ఇదిలా ఉంటే.. నాగశౌర్య, షామిలి జంటగా నటించిన ‘అమ్మమ్మగారిల్లు’ ఈ నెల 27న విడుదల కానుండగా.. సాయిపల్లవితో కలిసి నటించిన బైలింగ్వల్ మూవీ ‘కణం’ మే 20న రిలీజ్ కానుంద‌ని స‌మాచారం.

More News

వ‌రుణ్ చిత్రానికి రెండు వారాల వ‌ర్క్‌షాప్‌

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అనిల్ చిత్రాన్నే వెంకీ ప‌ట్టాలెక్కించనున్నారా?

విక్టరీ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'గురు' చిత్రం విడుదలై ఏడాదికి పైనే అవుతోంది.

భారీ ధర ప‌లికిన‌ 'సాహో' థియేట్రిక‌ల్‌ హక్కులు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’.

ఏప్రిల్ 27న 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్'

మార్వెల్ స్టూడియోస్ వారి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ హీరోల అందరి కలయిక.

ఫైబర్ నెట్ ద్వారా సినిమాలు...

అసోసియేుటెడ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు లిమిటెడ్ సంస్థ ..