ఆ విష‌యంలో క‌ల్యాణ్‌రామ్‌కి క‌ష్టంగా ఉందా?

  • IndiaGlitz, [Friday,November 29 2019]

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తొలిసారి సంక్రాంతి సంద‌ర్భంగా 'ఎంత‌మంచివాడ‌వురా' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అధికారకంగా 'ఎంత మంచివాడ‌వురా' సినిమా జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌వుతుంది. అయితే ఈ సినిమాకు మ‌హేశ్ 'స‌రిలేరు నీకెవ్వ‌రు', బ‌న్నీ 'అల‌..వైకుంఠ‌పుర‌ములో..' రూపంలో గ‌ట్టి పోటీ నెల‌కొంది. ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య క‌ల్యాణ్‌రామ్ సినిమా వ‌స్తుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు లేవ‌ని, అందుక‌నే బాక్సాఫీస్ వ‌ద్ద‌నే క్రేజ్ లేకుండా పోయింద‌ట‌. బిజినెస్ ప‌రంగా కూడా ఈ సినిమాకు గ‌డ్డుకాల‌మేన‌ట‌. నిర్మాత‌లు సినిమా బిజినెస్ కాక‌పోవ‌డంతో టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని స‌మాచారం.

క‌ల్యాణ్‌రామ్‌, మెహ‌రీన్ జంట‌గా స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎంత మంచివాడ‌వురా'. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ స‌మ‌ర్పకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.