close
Choose your channels

లుక్ టెస్ట్ చేయించిన క‌మ‌ల్‌

Wednesday, November 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లుక్ టెస్ట్ చేయించిన క‌మ‌ల్‌

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత మ‌రో సినిమా రూపొంద‌నుంది. ఆ సినిమాయే 'ఇండియ‌న్ 2'. . 1996లో 'ఇండియ‌న్‌' సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను నిర్మిస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రో ప‌క్క సెట్స్ నిర్మించే ప‌నులు ఆల్ రెడీ ప్రారంభ‌మైపోయాయి. డిసెంబ‌ర్‌లో చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది. కాగా.. ఈ సినిమా కోసం క‌మ‌ల్ హాస‌న్ లుక్ టెస్ట్ చేయించాడ‌ట‌.

భారతీయుడు అన‌గానే మ‌నకు వెంట‌నే ముస‌లి క‌మ‌ల‌హాస‌న్ గుర్తుకొస్తాడు. అలాంటి ముస‌లి గెట‌ప్ లుక్ టెస్ట్ చేశార‌ట‌. అందుకోసం విదేశీ మేక‌ప్ మేన్స్ చెన్నై వ‌చ్చార‌ట‌. కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న ఈ చిత్రంలో శింబు, దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా న‌టిస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.