కరోనా నుంచి కోలుకున్న కమల్ హాసన్... హెల్త్ బులెటిన్ విడుదల


Send us your feedback to audioarticles@vaarta.com


కరోనా వైరస్ బారినపడిన విలక్షణ నటుడు కమల్ హాసన్ కోలుకున్నారు. ఈ మేరకు బుధవారం చెన‍్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. కమల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నెల 3న ఆయనను డిశ్చార్జ్ చేస్తామని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి కమల్ హాసన్ తన రోజువారీ పనుల్లో నిమగ్నం అవ్వవచ్చని వైద్యులు తెలిపారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లి తిరిగి భారతదేశానికి వచ్చిన కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. ఒంట్లో నలతగా వుండటంతో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో కమల్ కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయింది. దీంతో చికిత్స కోసం నవంబర్ 22న ఆయన చెన్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్‌లో చేరారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. అంతా అప్రమత్తంగా వుండాలని ఇదిలా ఉండగా కమల్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. కమల్‌హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కలయికలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా సమాచారం. అలాగే తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2లో కూడా కమల్ హాసన్ నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.