క‌మ‌ల్ క్లారిటీ ఇచ్చేశాడు

  • IndiaGlitz, [Monday,September 12 2016]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ ఇప్పుడు రెస్ట్‌లో ఉన్నాడు. అయితే సినిమాకు సంబంధించిన రైటింగ్ వ‌ర్క్‌ను మ‌రోసారి చెక్ చేసుకుంటున్నాడు. శభాష్ నాయుడు సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌లో గాయ‌ప‌డ్డ క‌మల్ హాస‌న్ అప్ప‌టి నుండి చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌లేదు. చిత్రీక‌ర‌ణను తాత్కాలికంగా ఆపేశారు.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుండి ప్రారంభం అవుతుందని క‌మ‌ల్ హాస‌న్ స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌గానే కోలుకుంటున్నాన‌ని, ప‌రీక్షించిన డాక్ట‌ర్లు న‌వంబ‌ర్ నుండి చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌వ‌చ్చున‌ని తెలియ‌జేశార‌ని క‌మ‌ల్ హాస‌న్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. సెప్టెంబర్ నుండి సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని వినిపిస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. కామెడి ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, శృతిహాస‌న్ న‌టిస్తున్నారు.

More News

గోపీచంద్‌ను లైన్‌లో పెట్టాడు

మాస్ మ‌హారాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత వేరే సినిమాలేవీ చేయడం లేదు. విక్రం సిరి దర్శకత్వంలో ఇప్పుడు సినిమాను స్టార్ట్ చేశాడు.

క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌లో 'ధృవ‌'

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `ధృవ‌`. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

పూరి, ఎన్టీఆర్ టైటిల్ ఇదేనా....?

`జ‌న‌తాగ్యారేజ్` స‌క్సెస్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి `టెంప‌ర్` వంటి స‌క్సెస్ ఇచ్చిన పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. పూరి ఇప్పుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌తో ఇజం సినిమాను రూపొందిస్తున్నాడు.

జనతా గ్యారేజ్ చిత్ర బృందాన్ని అభినందించిన పుల్లెల గోపీచంద్ , పీవీ సింధు

భారత దేశానికి ఎందరో ఛాంపియన్ ప్లేయర్స్ ను అందించిన కోచ్ మరియు ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్.

పవన్ పేరు మార్చుకోవాలన్న వర్మ....

పవన్ కల్యాణ్ ను ట్విట్టర్ వేదికగా చేసుకుని పొగుడుతూనో,తిడుతూనో ఉండే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ